సీబీఐ క్లీన్‌చిట్‌పై ‘ఏకసభ్య’ డ్రామా! | YSRCP President Perni Nani fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

సీబీఐ క్లీన్‌చిట్‌పై ‘ఏకసభ్య’ డ్రామా!

Feb 6 2026 5:09 AM | Updated on Feb 6 2026 5:09 AM

YSRCP President Perni Nani fires on chandrababu naidu

లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ సిట్‌ చార్జిషీట్‌లో స్పష్టంగా తేల్చినా ఇంకా కుట్రలా?: మాజీ మంత్రి పేర్ని నాని 

సీబీఐ రిపోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలు ఏ ఒక్కరి పేరూ లేకపోయినా కొత్తగా కమిషన్‌ నియమించి వారి పేర్లు చేర్చే కుట్రలు 

శ్రీవారికి చేసిన మహాపచారం మనసులో దహించేయడం వల్లే ప్రెస్‌మీట్‌లో అస్మదీయుల ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు 

సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికిపోయిన బాబు 

చంద్రబాబు హయాంలో రూ.291కే కిలో నెయ్యి కొనుగోలు.. హర్ష్ డెయిరీకి అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వమే బాబూ 

ఆ నాలుగు ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్‌ బంకులో ఉంచారు.. సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవీ డెయిరీ పేరుతో కొండపైకి పంపారు.. లడ్డూల్లో కలిపేశారు.. 

ఇప్పుడు చెప్పండి ఎవరు పాపాత్ములో? 

ఎవరు మట్టికొట్టుకుపోవాలి..? ఎవరు సర్వనాశనం అవుతారో చెప్పు బాబూ? 

ఆలయాలను కూలగొట్టిన చరిత్ర చంద్రబాబుదే 

రోజుకో మతం పేరుతో పవన్‌ డ్రామాలు 

వీటిని ప్రశ్నించాలని స్వామీజీలను కోరుతున్నాం  

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి­లో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ దుష్ప్రచారానికి సీబీఐ సిట్‌ రిపోర్టుతో చెక్‌ పడటం.. కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఏకసభ్య వి­చా­రణ కమిషన్‌ అంటున్నారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామ­య్య (నాని) మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తదుపరి చర్య­లు తీసుకోమని సీబీఐ సిట్‌ చెప్పలేదని.. దోషు­ల­పై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని గుర్తు చేశారు. మరి సిట్‌ రిపోర్టులో వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నా­యా? అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. 

లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ సిట్‌ చార్జిషీట్‌లో స్పష్టంగా తేల్చినా నిస్సిగ్గుగా ఇంకా కుట్రలు పన్నుతారా? అని ధ్వజమె­త్తారు. ఏమీ లేకపోయినా రాజకీయ కుట్రలతో వైఎస్సార్‌ సీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశా­రు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  

‘సుప్రీం’ జోక్యంతో సాగని బాబు ఆటలు.. 
లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని దారుణమైన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. తన ప్రభుత్వం ఆధ్వ­ర్యంలో సిట్‌­ను నియమించి వాటి­నే రిపోర్టు­లో ఇచ్చేద్దామని భావించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్‌ ఏర్పాటు కావడంతో ఆయన ఆటలు సాగలేదు. సుప్రీంకోర్టు ని­య­మించిన సీబీఐ సిట్‌ దర్యాప్తులో అన్నీ తేలిపోవడంతో.. చంద్రబాబు తనను తదు­పరి చర్యలు తీసు­కోమని చెప్పిందంటున్నారు. 

కానీ సీబీఐ సిట్‌ చెప్పి­ంది.. తప్పు చేసిన వారిపై చర్య­లు తీసుకోమనే. ఆ దోషుల్లో మీరు ఇంతగా విషం చిమ్ము­తు­న్న జగన్‌ పేరు ఉందా? సిట్‌ రిపోర్టులో జగన్‌ కానీ, అప్పటి దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ పేరు కానీ, ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, టీటీడీ ఈవో, జేఈవో.. ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిఫా­ర్సు చేసిన అధికారులే ఇందులో ఉన్నారు. ఈ పాపం వైఎస్‌ జగన్‌కు ఆపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  

నెయ్యి కిలో రూ.291కే మీరు కొనలేదా? 
శ్రీవారి ప్రసాదంలో కెమికల్స్‌ కలిశాయని, మార్కెట్‌ కన్నా తక్కువ రేటు రూ.319కే ఎలా ఆవు నెయ్యి కొన్నారని అడుగుతున్నారు. తక్కువ రేటుకు నెయ్యి కొన్నారు కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీలో ఇద్దరు అధికారులు హర్‌‡్ష ఫ్రెష్‌ అనే డెయిరీని 2019 ఫిబ్రవరిలో ఆమో­దిస్తే... ఆ తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం మీద నిందలు వేస్తు­న్నారు. నాడు ఫిబ్రవరి తర్వాత ఉన్న ప్రభుత్వం మాదే అయితే మే నెలలో ఈసీతో పోట్లాడి మీరు క్యాబినెట్‌ మీటింగ్‌ ఎలా పెట్టారు? ఎలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పోలింగ్‌ తర్వాత కూడా మీ ప్రభుత్వం యాక్టివ్‌గానే పని చేసింది. 

2019లో జగన్‌ సీఎం కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలోనే ఈ హర్‌‡్ష ఫ్రెష్‌ డెయిరీని తీసుకొచ్చారు. ఆ తర్వాత అదే భోలే బాబా డెయిరీగా పేరు మార్చుకుంది. అప్పట్లో వీళ్లు 82 వేల కేజీలు ట్యాంకర్లలో, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మీరు కిలో నెయ్యి రూ.291కి ఎలా కొన్నారు? మా హయాంలో రూ.319, రూ.329కి కొనుగోలు చేస్తే తప్పు అంటున్నారు. ఛాలెంజ్‌ చేస్తున్నా.. టెండర్లు వివరాలు తేదీలతో సహా బయ­ట­పెట్టండి. ఎవరు దొంగో ఎవరు దొరో తేలుతుంది.  

రోజుకో మతం పేరుతో పవన్‌ డ్రామా.. 
పవన్‌ కళ్యాణ్‌ ఉచ్ఛం నీచాలు మరిచి విషం చిమ్మే వ్యక్తి! క్రిస్టియన్‌ అంటారు.. బాప్టిజం తీసుకున్నా అంటారు. నన్ను, చంద్రబాబును తిడుతుంటే మీరు కాచుకోరా? అని పవన్‌ కళ్యాణ్‌ ఆయన అన్నయ్యను తిట్టారని జనసేన నేతలే చెబుతున్నారు. దేవుడంటే భయం లేని వారు ఇవాళ మాట్లాడుతున్నారు. అదే అన్నయ్య.. గతంలో దేవుడే లేడని అంటాడు! దేవుడిని విమర్శించను.. లేని వారి గురించి ఎలా మాట్లాడతా? అంటాడు. 

తమ్ముడు కోటింగ్‌ ఇచ్చాక బయటికి వచ్చి.. నేను సనాతన హిందువు­ను! వైఎస్‌ జగన్‌ క్రిస్టియన్‌ అంటూ దిగజారి మాట్లా­డుతున్నాడు. రామతీర్ధంలో రాముడి విగ్ర­హం ధ్వం­సం చేసిన వాళ్లెవరో పవన్‌కు తెలియదా? ఆ ఘటన తర్వాత నెల రోజుల్లో కొత్తగా విగ్రహం చే­యించి హైందవ సంప్రదాయాల ప్రకారం గత ప్రభుత్వం పునఃప్రతిష్టించిన విషయం తెలియదా? అంతర్వేది రథాన్ని కాల్చారంటూ మాట్లాడుతున్న పవన్‌ కళ్యాణ్‌.. మీ ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం పక్కన పెంటపాడులో రథాన్ని తగలబెడితే చర్యలు తీసుకున్నారా? అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని మేం మళ్లీ ఉత్సవాల కల్లా కొత్తది చేయించి పెట్టాం. మరి మీరు పెంటపాడులో రథం తిరిగి చేయించారా? 

గుళ్లు ధ్వంసం చేసిన చరిత్ర బాబుదే 
2015–16లో విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరు­తో పలు ఆలయాలను ధ్వంసం చేసిన చంద్రబాబు... 250 గుళ్లు జగన్‌ ధ్వంసం చేశారని అనటానికి సిగ్గుందా? మతం పేరుతో విషం చిమ్ముతున్న మీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలే కదా అవి. ఉత్సవమూర్తులే కాదు.. గర్భగుడిలో ఉన్న మూర్తులను కూడా మీ ప్రభుత్వంలో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గుళ్లలో కనీసం సంప్రోక్షణ చేశారా? అపచా­రం చేశామని చెంపలు వాయించుకున్నారా? ఎక్కడైనా మెట్లు కడిగారా? మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని జగన్‌ తిరిగి నిర్మించారు. 

దేవుడి మీద పగ పెట్టుకున్నారని అంటున్న పవన్‌.. ఆ దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నందుకు ఏమైపోతారో ఆలోచించుకోవాలి. అయోధ్యకు జంతుకొవ్వు, పందికొవ్వుతో లక్ష లడ్డూలు పంపించారని పవన్‌ ఈ రోజుకూ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉంటుందా? నాటి టీటీడీ బోర్డు సభ్యులు సౌరభ్‌ బోరా, మైహోం రామేశ్వరరావు అయోధ్యకు శ్రీవారి ప్రసాదం లక్ష లడ్డూలు పంపిద్దామని, అందుకు కావాల్సిన శ్రేష్టమైన 2 వేల కిలోల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. 

ఈ నిర్ణయానికీ, మా ప్రభుత్వానికీ సంబంధం లేదు. అది టీటీడీ బోర్డు నిర్ణయమే. కానీ పవన్‌ కళ్యాణ్‌ కొవ్వుతో చేసిన లడ్డూలు పంపించారని ఇవాళ్టికీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్‌ హిందూ ధర్మాన్ని గౌరవించలేదంటున్న పవన్‌.. తోలు బూట్లు వేసుకుని దేవుడికి పూజలు చేస్తూ హారతిస్తున్న మీ మిత్రుడు చంద్రబాబును ఏమంటారు? తండ్రి చనిపోయినా తలనీలాలు ఇవ్వని పవన్‌ కళ్యాణ్‌ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్లా? చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట.  

తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటించింది వైఎస్సారే 
ఏడు కొండలను నాడు వైఎస్సార్‌ రెండు కొండలు అన్నారంటూ చంద్రబాబు, పవన్‌ దు్రష్పచారం చేస్తున్నారు. తిరుమల ఏడు కొండలను దివ్యక్షేత్రం అని పిలవాలని, ఆ కొండల మీద అన్యమత ప్రచా­రం నిషిద్ధమని 2007 జూన్‌ 2న వైఎస్సార్‌ జీవో ఇచ్చింది నిజం కాదా? ఇప్పుడు సర్వనాశనం అయిపోయేది, మట్టికొట్టుకుపోయేది ఎవరో పవన్‌ కళ్యా­ణ్‌ చెప్పాలి. 

తమ ఇంట్లో నుంచి  చూస్తుంటే ఏడు కొండలు కనిపిస్తాయని, భక్తి పారవశ్యం చెందుతున్నట్లు చంద్రబాబు చెబుతున్న మాటలు.. వందకోళ్లను తినేసే తోడేలు సాయంత్రం ప్రవచనాలు చెబుతున్నట్లుంది! మీ మాటలు నమ్మటం లేదని పవన్‌ కళ్యాణ్‌తో చెప్పిస్తున్నట్లున్నారు. జనం ఆయన మాటలు కూడా నమ్మడం ఎప్పుడో మానేశారు.

జంతు కొవ్వు ప్రచారం మీ నలుగురిదే 
వైఎస్‌ జగన్‌ క్రిస్టియన్‌ అని... శ్రీవేంకటేశ్వరస్వామికి హిందూ భక్తులను తగ్గించేయడానికే ఇదంతా చేశారని నిర్లజ్జగా పిచి్చమాటలు చెబుతున్న మీకు.. కల్తీ నెయ్యి నాలుగు ట్యాంకర్లు వాడి లడ్డూలు తయారు చేసినా నీచం అనిపించదు! జంతువుల కొవ్వు లేదని ఎవరు చెప్పారని గద్దిస్తున్న చంద్రబాబు... అది ఉందని ఎవరు చెప్పారో బయటపెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి మినహా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎవరూ చెప్పలేదు. 

80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకుపోదామని ఈ డ్రామాలు చంద్రబాబూ? పవన్‌ కళ్యాణ్‌ ఒక్కో దశలో ఒకలా.. క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందువు అని మాట్లాడుతుంటారు. పీఏ అప్పన్నకు రూ.4.65 కోట్లు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. మరి మీ పీఏ శ్రీనివాస్‌కు రూ.2 వేల కోట్లు వచ్చాయని ‘ఈడీ’ చెప్పిన విషయాన్ని మర్చిపోతున్నారు. అది బహిర్గతం కాగానే ఆయన విదేశాలకు పారిపోయాడు. మీరు తిరిగి ముఖ్యమంత్రి కాగానే అమెరికా నుంచి తిరిగి ఇక్కడ వాలిపోయాడు. 

వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసి తానూ, తన కుమారుడు కలకాలం అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. సీబీఐ సిట్‌ చార్జ్‌షీట్‌లో ఎక్కడా వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు చెప్పకపోయినా పవన్‌ కళ్యాణ్‌ వితండవాదం చేస్తున్నారు. రేపు కొత్త కమిషన్‌ (వన్‌మెన్‌ కమిషన్‌) వేసి జగన్‌ను, వైవీ సుబ్బారెడ్డిని చేర్చే దుర్బుద్ధితో ఉన్నారని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. 

దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వీళ్ల మాటలున్నాయి. మతం పేరుతో జగన్‌ను నాశనం చేయాలని ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అపచారాలను ప్రశ్నించాలని, కట్టడి చేయాలని స్వామీజీలను ప్రవచనకారులను, హైందవ ధర్మ పరిరక్షకులను కోరుతున్నాం.

ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? 
శ్రీవేంకటేశ్వరస్వామివారికి తలపెట్టిన అప­చా­రం తన మనసులో దహించేయడం వల్లే ప్రెస్‌మీట్‌లో అస్మదీయులు అడుగు­తున్న ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపో­తు­న్నారు. టీటీడీని ప్రక్షాళన చేయమని మీరు బాధ్యతలు అప్పగించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు అక్కడ ఎందుకు లేరు? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నియమించిన ఈవో శ్యామలరావు... నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కి పంపేశామని, వాటి శాంపిల్స్‌ ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపితే వనస్పతి ట్రేసెస్‌ ఉన్నాయని తేలిందని చెప్పారు. 

ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన ఎక్కడా చెప్పలేదు. కేవలం వనస్పతి కలిసిందని మాత్రమే చెప్పారు. జంతుకొవ్వు కలిసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని లోకేశ్, చంద్రబాబు చెప్పారు. ఆవునెయ్యి కాకుండా జంతువుల కొవ్వు, నాసిరకం సరుకులతో జగన్‌ లడ్డూలు చేయించారని, తాము మాత్రం నాలుగు లారీలను వెనక్కి  పంపామని చెప్పుకున్నారు. ఏఆర్‌ డెయిరీ నుంచి తెప్పించి వెనక్కి పంపిన నాలుగు లారీలు వైష్ణవీ డెయిరీకు వెళ్లాయని సిట్‌ రిపోర్టులో పేర్కొంది.

ఈ విషయం భోలేబాబా వాళ్లే విచారణలో చెప్పారు. నెల రోజుల పాటు ఈ నాలుగు ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్‌ బంకులో నిల్వ ఉంచి చివరికి సీలు కూడా తీయకుండా, సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవీ డెయిరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డూల్లో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? ఎవరు మట్టికొట్టుకుపోవాలి? ఎవరు సర్వనాశనం అవుతారు?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement