కేజ్రీవాల్‌ విచారణకు సీబీఐకి అనుమతి | Arvind Kejriwal To Be Prosecuted By CBI In Delhi Excise Policy Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Delhi Liquor Policy Case: కేజ్రీవాల్‌ విచారణకు సీబీఐకి అనుమతి

Aug 23 2024 7:03 PM | Updated on Aug 23 2024 8:03 PM

Arvind Kejriwal To Be Prosecuted By CBI In Delhi Excise Policy Case

న్యూఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టై తీహార్‌జైలులో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను అవినీతి కేసులోప్రాసిక్యూట్‌ చేసేందుకు తమకు అనుమతి లభించినట్లు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) సంస్థ వెల్లడించింది. లిక్కర్‌స్కామ్‌ అవినీతి కేసులో ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌నూ విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. 

తమకు అనుమతి లభించిన విషయాన్ని సీబీఐ తాజాగా  రౌస్‌ ఎవెన్యూకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌పై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌ను  ఆగస్టు 27న కోర్టు పరిగణలోకి తీసుకోనుంది. ఛార్జ్‌షీట్‌ అనంతరం కేసు విచారణ ముందుకు సాగాలంటే కేజ్రీవాల్‌ విచారణకు పరిపాలన పరమైన అనుమతి తప్పనిసరి. 

దీంతో సీబీఐ ఈ మేరకు అనుమతులు తెచ్చుకుంది.  మరోవైపు, సీబీఐ అరెస్టును సవాలు, బెయిల్‌ విజ్ఞప్తిపై దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 5కు వాయిదా వేసింది. లిక్కర్‌ స్కామ్‌  ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్‌ మంజూరైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement