
బిగ్ బుల్ హర్షద్ మెహతా.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకే కాదు.. మార్కెట్ గురించి ఎలాంటి పరిజ్ఞానం లేనివారికి కూడా పరిచయం అక్కర్లేని పేరు. స్టాక్ బ్రోకర్‌గా కెరియర్‌ను ప్రారంభించి.. బ్యాంకుల్లో ఉన్న లొసుగులతో బ్యాంక్ రిసిప్ట్స్ (BRs) ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా దుర్వినియోగంతో భారత ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేసిన ఉదంతం. 1992లో జరిగిన ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మూడు దశాబ్దాల తర్వాత, పౌంజీ స్కాం రూపంలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. రూ.49వేల కోట్ల స్కాంతో హర్షద్ మెహతా స్కాం తరువాత దేశంలో అత్యంత ఆర్థిక నేరాల్లో ఒకటిగా నిలిచింది. ఏంటి ఈ స్కామ్? ఎవరు చేశారు?
నిర్మల్ సింగ్ భాంగూ. పంజాబ్‌లోని బర్నాలా నివాసి. 1970లలో ఓ వైపు ఇంటింటికి తిరిగి పాలమ్ముతూ పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగం కోసం కోల్‌కతాకు వెళ్లారు. అక్కడ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ పెర్ల్స్‌లో చేరాడు. ఆ తరువాత అంచలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ సంస్థ ఈ సంస్థ పెట్టుబడిదారులను మోసం చేసింది. దివాళా తీయడంతో భాంగూ ఉద్యోగం కూడా పోయింది.
అప్పుడే తనకున్న అనుభవంతో 1996లో నిర్మల్ సింగ్ భంగూ.. గుర్వాంత్ ఆగ్రో టెక్ లిమిటెడ్‌తో సంస్థను ప్రారంభించారు. అలా 30ఏళ్లుగా అంటే 1996లో గుర్వాంత్ ఆగ్రో టెక్ నుంచి పెర్ల్స్ అగ్రో టెక్ మారిన ఈ సంస్థ దాదాపు రూ.49,000 కోట్ల పౌంజీ కుంబకోణానికి తెరతీసింది. దేశం మొత్తం మీద 5 కోట్ల మంది అమాయకులను మోసం చేసి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసింది. చివరికి ఆసంస్థ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఆ సంస్థ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని అరెస్ట చేసింది. తాజాగా ఆ సంస్థ డైరెక్టర్ గుర్నాసింగ్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు.
ఈ కుంభకోణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో పెట్టుబడిదారులు గతంలో పోలీస్ కేసు ఫైల్ చేశారు, ఆ తర్వాత ఈ విషయం CBIకి చేరింది. ఈ కేసులో పేరున్న 10 మంది నిందితుల్లో నలుగురిని CBI ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపింది. గుర్నామ్ సింగ్ అరెస్టు తర్వాత పెట్టుబడిదారులు తమ డబ్బు తిరిగొస్తుందని ఆశతో ఉన్నారు. EOW సహా ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ ఫ్రాడ్ నెట్‌వర్క్ మూలాలను లోతుగా విచారిస్తున్నాయి.