
భోపాల్: ప్రముఖ ఐఏఎస్ అధికారిణి సృష్టి దేశ్‌ముఖ్ గౌడ భర్త ఐఏఎస్ నాగార్జున బి.గౌడ చుట్టూ అవినీతి అరోపణల ఉచ్చు బిగుస్తోంది. మైనింగ్ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఓ కంపెనీకి భారీ మొత్తంలో ప్రభుత్వం జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కోట్ల నుంచి రూ.10వేల లోపుకు తగ్గించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. ఆ అవినీతి ఆరోపణల్ని జిల్లా మేజిస్ట్రేట్ మేజ సిద్ధార్థ్ జైన్ ఖండించారు.
2019 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున బి. గౌడ, ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా పంచాయతీ సీఈవోగా పనిచేస్తున్నారు. గతంలో హర్దా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) గా పనిచేసే సమయంలో మైనింగ్ శాఖ ఓ సంస్థకు విధించిన కోట్ల రూపాయాల జరిమానాను భారీ మొత్తంలో తగ్గించారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి.
ఆర్టీఐ యాక్టివిస్ట్ ఆనంద్ జాట్ ఇదే అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఐఏఎస్ నాగార్జున గౌడ ఓ ప్రైవేట్ సంస్థపై విధించిన రూ. 51 కోట్ల అక్రమ మైనింగ్ జరిమానాను కేవలం రూ. 4,032 కు తగ్గించారని ఆరోపణలు గుప్పించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో హర్దా జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ మేజ సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ.. మైనింగ్‌లకు సంబంధించిన కేసులలో ప్రాథమిక నోటీసులను వివరణ కోరుతూ ఇచ్చారని గుర్తు చేశారు. అందులో అవినీతికి తావులేదన్నారు. సంబంధిత ప్రిసైడింగ్ అధికారి (ఐఎఎస్ నాగార్జున గౌడ) చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించారు. ఈ ఆర్డర్‌పై ఎవరైనా సంతృప్తి చెందకపోతే, దానిపై కోర్టుకు అప్పీల్ చేసుకునేలా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఇది న్యాయ ప్రక్రియ’అని జైన్ అన్నారు.
విచిత్రం ఏంటంటే?.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ పరీక్షల్లో పోటీ పడుతున్న అభ్యర్ధులకు ఉపయోగపడేలా గతేడాది ‘ద మ్యాన్యువల్ ఆన్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్’ అనే బుక్ సైతం రాశారు. అలాంటి వ్యక్తి చుట్టూ అవినీతి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
UPSC topper Srushti Deshmukh’s IAS husband Nagarjun accused of taking Rs 10 crore bribe
Name: Nagarjun B. Gowda 🏛️
Post: IAS Officer 👔
Wife: IAS Officer 💼
Work: Motivational Speaker 🎤
Achievement: Book on Ethics 📖
Allegation: ₹10 Cr Bribe 💸
Gowda, while serving as the… pic.twitter.com/63A9tfAiup— Karnataka Portfolio (@karnatakaportf) October 11, 2025
తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్
ఐఏఎస్ సృష్టి జయంత్ దేశ్‌ముఖ్ 2018 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా ఐదవ ర్యాంక్ సాధించారు. ఆమె 2019 బ్యాచ్‌కు చెందిన ఐఎస్ అధికారిణి. మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్ని క్లియర్ చేశారు.ఆమె శ్రమ, క్రమశిక్షణ, స్వయంగా చదివే విధానం యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తోంది. ఓ వైపు మధ్యప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారిణిగా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మోటివేషనల్ మెసేజ్‌లు,యూపీఎస్సీ టిప్స్, పాజిటివ్ ఆలోచనలు తరచూ షేర్ చేస్తూ ప్రేరణగా నిలుస్తున్నారు.