సింహాద్రిపురం: వైఎస్సార్ జిల్లాలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ జరిపిన దాడుల్లో సీఐ కేవీ రమణ, ఎస్‌ఐ అనిల్‌లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో బాధితుడిని నుంచి రూ. 3 లక్షల లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. దాంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో సీఐ, ఎస్‌ఐలను పట్టుకున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికాలు దాడులు చేశారు. పులివెందుల రూరల్ సీఐ, సింహాద్రిపురం ఎస్‌ఐలను ఈ దాడుల్లో ఏసీబీకి దొరికేశారు. పులివెందులలో అత్యంత వివాదాస్పద సీఐగా కేవీ రమణకు పేరుంది. తాజాగా పోలీస్ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం కేవీ రమణను మరింత ఇరకాటంలోకి నెట్టింది.
విజయనగరం: జిల్లాలోని చాకివలస ఇంచార్జ్ వీఆర్వో ఏసీబీకి చిక్కారు. రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇంచార్జ్ వీఆర్‌ఓ చిట్టిబాబు.


