సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం | YS Jagan Welcomes CBI Probe into Savindra Case After High Court Order | Sakshi
Sakshi News home page

సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం

Sep 27 2025 2:28 PM | Updated on Sep 27 2025 3:34 PM

Ys Jagan Happy Over Handing Over Savindra Case To Cbi

సాక్షి, తాడేపల్లి: సవీంద్ర(Savindra) కేసును సీబీఐ(CBI)కి అప్పగించటంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి‌ నిదర్శనమన్న వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదన్నారు.

‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: చంద్రబాబు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement