సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే పాచిపోయిన ఆరోపణలు చేయటం ఏంటని ప్రశ్నించింది. తమ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు చేసిన వపన్ కళ్యాణ్‌పై మండిపడింది. పాత ఆరోపణలకు సినిమా రంగు పూసి కొత్తగా ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నిప్పులు చెరిగింది.
‘‘డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది. ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారు. పాచిపోయిన పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలు అవుతాయా?
..సర్వే సెటిల్ మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్‌కళ్యాణ్ కాదనగలరా?. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బురదచల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులతో ఎన్నో కమిటీలు వేసి, విచారణలమీద విచారణలు చేశారు. కానీ ఆరోపణలను రుజువు చేయలేకపోయారు.
..ఇన్నిరోజుల్లో ఒక్క ఆధారాన్నీ చూపలేకపోయారు. నేపాల్‌కు ఎర్రచందనం అంటూ ఇదే వపన్‌కళ్యాణ్ అర్థంలేని విమర్శలు చేశారు. నిరూపించాలని మిథున్‌రెడ్డి సవాల్ విసిరితే ఇప్పటికీ దానిపై నోరు మెదపలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, తుపాను నష్టపరిహారం అందించలేక ఇంకా అనేక సమస్యలను పరిష్కరించలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ వైఎస్సార్‌సీపీ దుయ్యబట్టింది.
🚨 Dare to answer these questions, @PawanKalyan ?
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లన్నీ… https://t.co/vyPJQ0kSWp
— YSR Congress Party (@YSRCParty) November 13, 2025


