అవినీతి తిమింగళం.. డీఐజీ ఇంట్లో నోట్ల కట్టలు, కిలోన్నర బంగారం.. | Punjab DIG Harcharan Bhullar Arrested by CBI; ₹5 Crore Cash, Luxury Cars & Gold Seized in Bribery Case | Sakshi
Sakshi News home page

అవినీతి తిమింగళం.. డీఐజీ ఇంట్లో నోట్ల కట్టలు, కిలోన్నర బంగారం..

Oct 17 2025 8:10 AM | Updated on Oct 17 2025 11:21 AM

CBI arrests Punjab DIG Harcharan Bhullar Over Bribery

చండీగఢ్‌: పంజాబ్‌లో అవినీతి తిమింగలం బయటపడింది. పంజాబ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(డీఐజీ)(DIG Harcharan Bhullar) ఆఫ్‌ పోలీస్‌ హర్‌చరణ్‌ భుల్లార్‌ను లంచం ఆరోపణలపై సీబీఐ(CBI) అధికారులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఎనిమిది లక్షల రూపాయల లంచం కేసులో సీబీఐ.. భుల్లార్‌కు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేయగా విస్తుపోయే దృశ్యాలు బయటకు వచ్చాయి.

వివరాల ప్రకారం.. మండి గోబింద్‌గఢ్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఆకాశ్‌ బట్టాపై 2023లో కేసు నమోదైంది. ఈ కేసును మాఫీ చేసేందుకు, నెలవారీ మామూళ్లతోపాటు రూ.8 లక్షల లంచం ఇవ్వాలని డీఐజీ భుల్లార్‌ డిమాండ్‌ చేశారు. ఇందుకుగాను కిషన్‌ అనే మధ్యవర్తితో వ్యవహారం నడిపారు. ఈ మేరకు వ్యాపారి ఆకాశ్‌ నుంచి సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. గురువారం చండీగఢ్‌లో ఆకాశ్‌ నుంచి డీఐజీ తరఫున రూ.8 లక్షలు తీసుకుంటుండగా కిషన్‌ను పట్టుకున్నామని సీబీఐ తెలిపింది.

 

ఈ సందర్భంగా డీఐజీ, మధ్యవర్తి కిషను, వ్యాపారి ఆకాశ్‌ మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణ ఆధారంగా డీఐజీని అరెస్ట్‌ చేశామని పేర్కొంది డీఐజీ కార్యాలయం, నివాసంలో జరిపిన సోదాల్లో రూ.5 కోట్ల నగదు, కిలోన్నర బరువున్న ఆభరణాలు, ఆస్తి పత్రాలు, మెర్సిడెజ్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు, డబుల్‌ బ్యారెల్‌ గన్, పిస్టల్,  రివాల్వర్, ఎయిర్‌ గన్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వివరించింది. ఇద్దరు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోపర్ రేంజ్ DIGగా భుల్లార్ విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement