సాక్షి,నగరి: రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంలో సీబీఐ రిపోర్టుపై గురువారం ఆమె చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడారు.
తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీశారు. కూటమి నేతల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శిక్షించాలి. చంద్రబాబు ప్యాకేజీ అందగానే పవన్ ఊగిపోయాడు.
సనాతన ధర్మం ముసుగులో ప్యాకేజీల కోసం ఆడించే డ్రామా ఆర్టిస్టులు. పవన్ ఏ గుడిమెట్లు కడుగుతారో చెప్పాలి. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?.వైఎస్ జగన్ కాళ్లు కడిగి చంద్రబాబు, పవన్ నెత్తిన చల్లుకోవాలి. ఆడవాళ్లకు అబార్షన్‌లు చేయించి.. రోడ్డున పడేసిన వాళ్లు.. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?. తప్పుడు ప్రచారం చేసిన నోర్లను పినాయిల్‌తో కడగాలి. శ్రీవారి భక్తులకు చంద్రబాబు, పవన్ ఏం సమాధానం చెప్తారు.
విజయవాడ మునిగినప్పుడు చంద్రబాబు, ఇతర మంత్రులు హైదరాబాద్‌లో ఉన్నారు. కూటమి నేతలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు’అని మండిపడ్డారు.



