నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్ స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు | Father Colombo Medical Hospital Role In National Medical Council Scam, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్ స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు

Jul 4 2025 7:53 AM | Updated on Jul 4 2025 11:09 AM

Father Colombo Medical Hospital Role In National Medical Council Scam

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ స్కామ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు తేలింది. వరంగలకు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాల తీసుకున్నట్లు సమాచారం.

ఈ స్కాంలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కూడా కేసులు నమోదు చేశారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ మెడికల్ కాలేజీ తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. చత్తీస్‌గఢ్‌కు చెందిన రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు, బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.

రెండు దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమ్మిరెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల వసూలు చేసినట్లు తేలింది. డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి రెండు విడతలగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్లను మధ్యవర్తులుగా సీబిఐ గుర్తించింది. కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసఫ్ కొమిరెడ్డికి బ్రోకర్లు రూ.60 లక్షలు ముట్టజెప్పినట్లు సీబీఐ గుర్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement