
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొల్ల దుర్గాప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.
బీబీనగర్ టోల్ ప్లాజా పక్కన ఉన్న ఓ వ్యక్తి రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అయితే హైవే పక్కన రెస్టారెంట్ నిర్వహిస్తున్నందుకు యజమాని నుంచి దుర్గాప్రసాద్ రూ.లక్ష వరకు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా గొల్ల దుర్గాప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం,హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలో దుర్గా ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.