సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదీలీలు జరిగాయి. 20 మంది అధికారులను ఇతర ప్రదేశాలకు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటితో పాటు నాలుగు కమిషనరేట్ల పరిధిలోని డీసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు.. చేవేళ్ల డీసీపీగా యోగేష్, కూకట్‌పల్లి డీసీపీగా రీతిరాజ్, శేరిలింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపేట డీసీపీగా రక్షితామూర్తి, రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్, సిద్ధిపేట సీపీగా రష్మీ పెరుమాళ్, హెదరాబాద్ ఎస్పీ డీసీపీగా విజయ్ కుమార్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.




