
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కేసులో సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. తిరుమల లడ్డు కేసులో సిట్ పనిచేయడం ఆపేసిందా? అంటూ సీజేఐ ప్రశ్నించారు. ‘‘సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించకూడదా?. చిన్నప్పన్నను ఇంటరాగేషన్‌లో వేధిస్తే ఫిర్యాదు చేయొచ్చు కదా’’ అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.
చిన్నప్పన్నకు సిట్‌లో లేని అధికారి నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం.. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.