బాబు కుతంత్రం.. సీబీఐ తేల్చినా.. తప్పుడు ప్రచారమే! | Chandrababu Conspiracy on Tirumala Laddu Ghee Adulteration | Sakshi
Sakshi News home page

బాబు కుతంత్రం.. సీబీఐ తేల్చినా.. తప్పుడు ప్రచారమే!

Feb 3 2026 2:32 AM | Updated on Feb 3 2026 2:46 AM

Chandrababu Conspiracy on Tirumala Laddu Ghee Adulteration

లడ్డూ ప్రసాదంపై బాబు అదే కుతంత్రం

జంతు కొవ్వు కలిసిందంటూ పదేపదే చంద్రబాబు దు్రష్పచారం

ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించినట్లు నిస్సిగ్గుగా అబద్ధాలు.. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని చార్జ్‌షీట్‌లో కోర్టుకు నివేదించిన సీబీఐ 

ఎన్‌డీఆర్‌ఐ నివేదికను చార్జిషిట్‌లో స్పష్టంగా ప్రస్తావిస్తూ..  జంతు కొవ్వు కలవలేదని తేల్చిచెప్పిన దర్యాప్తు సంస్థ 

టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్థారిస్తూ ఎన్‌డీడీబీ నివేదిక  

అయినా సరే..రాజకీయ స్వార్థంతో చంద్రబాబు పన్నాగాలు 

పాపభీతి లేకుండా.. దేశంలో ఏ సీఎం సాహసించని రీతిలో అదే బుకాయింపు 

చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకోవాల్సిందిపోయి కుట్రలతో మరింత దిగజారుడు 

ఈ దు్రష్పచారం, అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై బాబు సర్కారు అణచివేత చర్యలు 

జంగిల్‌ రాజ్‌ పాలనతో పోలీసుల సమక్షంలోనే పచ్చమూకల దాడులు 

స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ పెద్దలు 

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెబుతున్నది నిజమే అయితే  ఆ విషయాలను సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొనేది కదా?  

వారి పేర్లను అందులో చేర్చి అరెస్టు చేసేది కదా?

సాక్షి, అమరావతి: బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బరి తెగించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దారుణమైన ఆరోపణలు చేశారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని ప్రఖ్యాత ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు నిర్వహించిన పరీక్షల్లో నిర్థారణ కావడం.. సాక్షాత్తూ సీబీఐ కూడా దర్యాప్తులో అదే విషయాన్ని తేల్చి న్యాయస్థానానికి నివేదించడంతో దిక్కు తోచని చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డీడీబీ) పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు చంద్రబాబు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. తన రాజకీయ స్వార్థం కోసం ఎన్‌డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.

టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్థారిస్తూ 2025 మార్చి 27న ఎన్‌డీడీబీ ల్యాబ్‌ నివేదిక ఇవ్వగా.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌డీఆర్‌ఐ ల్యాబొరేటరీ 2025 మే 16న రిపోర్టు ఇచ్చింది. అదే విషయాన్ని తన దర్యాప్తులో నిర్థారిస్తూ, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని పేర్కొంటూ సీబీఐ ఈ ఏడాది జనవరి 23న న్యాయస్థానంలో చార్జిషీట్‌ను సమర్పించింది. అయినా సరే.. ఏమాత్రం పాపభీతి లేకుండా.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని రీతిలో చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలాడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ నియమించిన సిట్‌ తేల్చిచెప్పినా... లెక్క చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.

చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకోవాల్సిందిపోయి రాజకీయ కుట్రలతో చంద్రబాబు మరింత దిగజారి వ్యవహరిస్తుండటం పట్ల శ్రీవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైందవ ధర్మం, కలియుగ దైవం తిరుమల శ్రీవారి పట్ల ఏమాత్రం భయభక్తులు లేకుండా చంద్రబాబు అసత్యాలు వల్లిస్తుండటం.. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు కుతంత్రాలకు పాల్పడటం పట్ల కన్నెర్ర చేస్తున్నారు. ఈ దారుణమైన అబద్ధాలు, నిందలను ప్రశ్నిస్తున్న వారిపై పోలీసుల సమక్షంలోనే దాడులకు పురిగొల్పుతూ ప్రభుత్వ పెద్దలు జంగిల్‌ రాజ్‌ పాలన సాగిస్తున్నారు. ఈ అరాచకాలను స్వయంగా పర్యవేక్షిస్తూ కుట్రలకు పదును పెడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది.   

సీబీఐ తేల్చిచెప్పినా అదే కుట్రా బాబూ! 
ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యా»ొరేటరీల్లో తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, గొడ్డు, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ  తన చార్జిషిట్‌లో స్పష్టం చేసింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్‌ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్‌ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్‌ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వు­లోనే కొలెస్ట్రాల్‌ ఉంటుంది. కొలెస్ట్రాల్‌ లేదని అంటే.. జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్టేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయాలను జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది.

రాజకీయ స్వార్థంతోనే చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది జాతీయ స్థాయిలో స్పష్టమైంది. అయితే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే నిరూపిస్తున్నారు. అందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేస్తున్న దుష్ప్రచారమే తాజా తార్కాణం. 2024 అక్టోబర్‌లో మొదలు పెట్టిన ఈ కుతంత్రాన్ని ఏడాదిన్నరగా కొనసాగిస్తుండటం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం. అందుకే వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఈ కేసు విచారణను చేపట్టింది. వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి శాంపిళ్లను హర్యానాలోని ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌డీఆర్‌ఐ)లో ల్యాబరేటరీకి పంపించి పరీక్షించింది. ఆ నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని ఆ  పరీక్షల్లో వెల్లడైంది. ఈమేరకు శాస్త్రీయంగా విశ్లేíÙంచి ఎన్‌డీఆర్‌ఐ 2025 మే 16న సాధికారికంగా వెల్లడించిన ఆ నివేదికనే సీబీఐ నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షిట్‌లో స్పష్టంగా పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్‌ ప్రొఫైల్‌’ను పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది.   

ఎన్‌డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ చంద్రబాబు కుట్ర
లడ్డూ ప్రసాదంపై తమ దు్రష్పచారం బెడిసికొట్టడంతో చంద్రబాబు కంగు తిన్నారు. దాంతో రెండు రోజుల పాటు మౌనంగా ఉన్న ఆయన మళ్లీ అదే కుట్రను పదును పెట్టడం గమనార్హం. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించడంతోనే తాను అలా మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా ఎన్‌డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ దు్రష్పచార కుట్రకు తెగబడుతున్నారు.  వాస్తవానికి నెయ్యిలో వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలసి ఉండొచ్చని ఎన్‌డీడీబీ నివేదిక అభిప్రాయ­పడింది. అంటే మొక్కల నుంచి వచ్చే వెజిటబుల్‌ ఫ్యాట్‌నే ఫారిన్‌ ఫ్యాట్‌ అని కూడా చెబుతూ నివేదికలో అభిప్రాయపడింది. అది సర్వసాధారణ అంశమే. పశువులు తినే మొక్కలు, దాణాను బట్టి అది ఆధారపడి ఉంటుందని ఆహార శాస్త్ర నిపుణులే చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కానీ చంద్రబాబు మాత్రం  ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే టీటీడీ నెయ్యిపై దు్రష్పచారం కొనసాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిపే అవకాశం లేనే లేదని గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ పరీక్షల్లో వెల్లడైంది. అదే విషయాన్ని 2025 మార్చి 27న సీబీఐకి నివేదించింది. సీబీఐ ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషిట్‌లోనూ అదే విషయాన్ని స్పష్టంగా పొందుపరిచింది. టీటీడీ నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిసే అవకాశమే లేదని చార్జీషిట్‌లోని 208వ పేజీలో పేర్కొంది. అయినాసరే చంద్రబాబు ఎన్‌డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్పచ్రార కుట్రలను కొనసాగిస్తున్నారు. ఎన్‌డీడీబీ చెప్పని విషయాలను చెప్పినట్లుగా పదేపదే విష ప్రచారం చేస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.   

అదే నిజమైతే సీబీఐ ప్రస్తావించేది కదా! 
లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించి ఉంటే... సీబీఐ తన చార్జ్‌షిట్‌లో ఆ విషయాన్ని ప్రస్తావించేది కదా అని నిపుణులు చెబుతున్నారు. కానీ 219 పేజీల చార్జ్‌షిట్‌లో సీబీఐ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు.  ఎన్‌డీడీబీ నివేదిక గురించి కూడా చార్జ్‌షిట్‌లో ప్రస్తావించింది.. కానీ టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్‌డీడీబీ పరీక్షల్లో వెల్లడైనట్టు ఎక్కడా పేర్కొననే లేదు. అదే సమయంలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్‌డీఆర్‌ఐ ఇచ్చిన నివేదికనే సీబీఐ తన చార్జ్‌షిట్‌లో ప్రముఖంగా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ జంతు కొవ్వు కలవలేదన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా ఏమాత్రం ఇష్టపడటం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement