లేడీ ఫ్యాన్‌ చేసిన పనికి షాకైన ధునుష్‌.. వీడియో వైరల్‌ | Female Fan Going Down On Her Knees In Front Of Dhanush At Kara Prerelease Event | Sakshi
Sakshi News home page

లేడీ ఫ్యాన్‌ చేసిన పనికి షాకైన ధునుష్‌.. వీడియో వైరల్‌

Apr 27 2026 12:41 PM | Updated on Apr 27 2026 1:05 PM

Female Fan Going Down On Her Knees In Front Of Dhanush At Kara Prerelease Event

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయనకు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సినిమా ఈవెంట్‌ కోసం ఎప్పుడు వచ్చిన.. ధనుష్‌ని చూసేందుకు ఫ్యాన్స్‌ భారీగా తరలి వస్తుంటారు. నిన్న(ఏప్రిల్‌ 26) హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కర’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనూ అదే జరిగింది. ధనుష్‌ వస్తున్నాడని తెలిసి భారీగా అభిమానులు తరలివచ్చారు. అందులో ఓ మహిళా అభిమాని చేసిన పనికి ధనుష్‌ షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది?

ధనుష్‌ కోసం..
ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్‌ సమర్పణలో విఘ్నేష్‌ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్‌ సతీష్‌ కుమార్, రాజేశ్‌కుమార్‌ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కి ధనుష్‌ కూడా వస్తున్నాడని తెలిసి ఓ మహిళా అభిమాని ఆ హోటల్‌కి వెళ్లింది. తన అభిమాన హీరోని లైవ్‌లో చూసి మురిసిపోయింది.

మోకాళ్లపై కూర్చోని.. 
ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వేదికపై నుంచి వెళ్తుండగా.. సదరు మహిళా అతన్ని కలిసేందుకు వచ్చింది. తెలిసిన వారి సహాయంతో ధనుష్‌ను దగ్గరకు వెళ్లింది. అతను ఆమెను పలకరించగానే.. భావోద్వేగానికి లోనైంది. ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని నమస్కరించింది. ఊహించని ఈ పరిణామానికి ధనుష్ షాకయ్యాడు. క్షణాల్లో తెరుకొని వెంటనే ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మళ్లీ అలాగే చేయడంతో కాసేపు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత ఆమెను పైకి లేపి, మాట్లాడి, చివరకు ఆమెతో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement