Female fan
-
లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకైన ధునుష్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సినిమా ఈవెంట్ కోసం ఎప్పుడు వచ్చిన.. ధనుష్‌ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వస్తుంటారు. నిన్న(ఏప్రిల్ 26) హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కర’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ అదే జరిగింది. ధనుష్ వస్తున్నాడని తెలిసి భారీగా అభిమానులు తరలివచ్చారు. అందులో ఓ మహిళా అభిమాని చేసిన పనికి ధనుష్ షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది?ధనుష్ కోసం..ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్‌కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ ఈవెంట్‌కి ధనుష్ కూడా వస్తున్నాడని తెలిసి ఓ మహిళా అభిమాని ఆ హోటల్‌కి వెళ్లింది. తన అభిమాన హీరోని లైవ్‌లో చూసి మురిసిపోయింది.మోకాళ్లపై కూర్చోని.. ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వేదికపై నుంచి వెళ్తుండగా.. సదరు మహిళా అతన్ని కలిసేందుకు వచ్చింది. తెలిసిన వారి సహాయంతో ధనుష్‌ను దగ్గరకు వెళ్లింది. అతను ఆమెను పలకరించగానే.. భావోద్వేగానికి లోనైంది. ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని నమస్కరించింది. ఊహించని ఈ పరిణామానికి ధనుష్ షాకయ్యాడు. క్షణాల్లో తెరుకొని వెంటనే ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మళ్లీ అలాగే చేయడంతో కాసేపు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత ఆమెను పైకి లేపి, మాట్లాడి, చివరకు ఆమెతో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. A female fan goes down on her knees to greet #Dhanush at the #Kara event.#MamithaBaiju pic.twitter.com/ZtTLrqPmId— Milagro Movies (@MilagroMovies) April 26, 2026 -
మహిళా ఫ్యాన్‌ను ఎలా తిట్టాడో చూడండి
సాక్షి, ముంబయి : తన షార్ట్ టెంపర్‌తో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలిచే ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఫొటో దిగేందుకు ముచ్చటపడి ముందుకు వచ్చిన ఓ మహిళా అభిమానిపై నోరు పారేసుకున్నారు. ఆమెను చెడామడా మాటలు అంటుంటే అక్కడే ఉన్న ఆయన కుమారుడు, ప్రముఖ హీరో రణ్‌బీర్ కపూర్ ఒక్కమాటమాట్లాడకుండా ఉండిపోయారు. ఫ్యామిలీతో కలిసి ముంబయిలోని బాంద్రాలో పోష్ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆయన అలా గట్టిగా తిట్టడంతో ఆ అభిమాని కూడా కంటతడి పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చెక్కర్లు కొడుతోంది.. దానిపై మీరు ఓ లుక్కేయండి మరీ ! -
రజనీని ఆకట్టుకున్న అభిమాని
-
రజనీని ఆకట్టుకున్న అభిమాని
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. రజనీ సినిమా విడుదలవుతుంటే చాలు ఆయన కటౌట్లకు పాలాభిషేకాలు కామన్. ఇక రజనీ పుట్టినరోజు వేడుకల గురించైతే చెప్పక్కర్లేదు. ఆయనకు అభిమానులు ఉన్నారని అనడం కంటే భక్తులు ఉన్నారంటే బావుంటుందేమో. అంతటి సూపర్ స్టార్‌ని చూడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ అవకాశం అందరికీ రాదు. అలాంటిది స్వయంగా సూపర్ స్టారే ఆహ్వానిస్తే..? దాన్నే అదృష్టం అంటారు కదా. అదే జరిగింది ఓ మహిళా అభిమాని విషయంలో. తనను కలిసి వెళ్లమని స్వయంగా తలవైనా ఆమెకు కబురు పంపించారు. 'కబాలి' సినిమాలోని డైలాగులను చెప్తూ తీసిన వీడియోలతో రజనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అలానే ఓ మహిళ కూడా 'కబాలి రా' డైలాగ్‌ను కొద్దిగా మార్చి.. తను స్వతంత్రంగా జీవించే మోడ్రన్ గృహిణినంటూ రజనీ స్టైల్లో చెప్పిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ వీడియో చూసి ముగ్థుడైన సూపర్ స్టార్ ఆమె వివరాలు తెలుసుకుని, తన ఫామ్ హౌస్‌కి ఆహ్వానించి అభినందించారు. ఇక ఆమె ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.


