ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ చూస్తుంటే అన్యాయంపై పోరాడే పాత్రలో ధనుశ్ నటించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో సన్నివేశాలు చూస్తుంటే ఈ ఫుల్ అగ్రెసివ్‌గా కథ ఉండనున్నట్లు అర్థమవుతోంది. 'తాను నాటింది తానే నరుక్కోవాలి.. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకు వచ్చింది. అంతకంటే ముందు నా మీద పడ్డ మచ్చను తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు.


