లేటెస్ట్ తెలుగు సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత? | Jetlee And Gayapada Simham Movie Day 1 Collection | Sakshi
Sakshi News home page

Movie Collection: సింహం, జెట్‌లీ.. తొలిరోజు వసూళ్లు?

May 2 2026 4:11 PM | Updated on May 2 2026 4:28 PM

Jetlee And Gayapada Simham Movie Day 1 Collection

ఈ వీకెండ్ థియేటర్లలోకి తెలుగులో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. కమెడియన్ సత్య హీరోగా నటించిన 'జెట్‌లీ', దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన 'గాయపడ్డ సింహం' చిత్రాలు.. ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండింటికి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంత వసూలు చేశాయి? వీటి కంటే ఒకరోజు ముందు రిలీజైన ధనుష్ 'కర' సంగతేంటి?

(ఇదీ చదవండి: సత్య 'జెట్‌లీ' సినిమా రివ్యూ)

కమెడియన్ సత్య, లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' చిత్రానికి రితేష్ రానా దర్శకుడు. ప్రమోషన్స్‌తో అయితే ఆకట్టుకున్నారు గానీ మూవీలో చెప్పుకోదగ్గ కామెడీ లేదు, అలానే స్టోరీ కూడా గందరగోళంగా ఉండటం లాంటివి మైనస్ అయ్యాయి. స్టార్స్ ఎవరూ లేకపోయినప్పటికీ ఉన్నంతలో బాగానే వసూలు చేసింది. తొలిరోజు రూ.1.30 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో ఓ సినిమాతో వచ్చిన తరుణ్ భాస్కర్.. మూడు నెలలు తిరిగేసరికల్లా 'గాయపడ్డ సింహం' అంటూ వచ్చాడు. ట్రంప్‌పై చేతబడి చేయడం అనే విచిత్రమైన స్టోరీ లైన్‌తో తీసిన ఈ మూవీలోనూ పెద్గగా చెప్పుకోదగ్గ కామెడీ లేదు. దీంతో దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.76 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.

(ఇదీ చదవండి: ‘గాయపడ్డ సింహం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

ఇకపోతే గురువారం(ఏప్రిల్ 30) థియేటర్లలోకి వచ్చిన ధనుష్ 'కర' సినిమా సీరియస్‌గా సాగే డ్రామా. కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చలేదు. అయితేనేం రెండు రోజుల్లో రూ.20.20 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. 1990ల్లో రైతుల్ని బ్యాంక్‌లు లోన్స్ పేరు చెప్పి ఎలా మోసం చేసేవి అనే కల్పిత కథతో దీన్ని తెరకెక్కించారు.

(ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement