అమ్మకు క్యాన్సర్‌.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: హీరోయిన్‌ | Sneha Ullal: I Entered Bollywood at age of 16 | Sakshi
Sakshi News home page

Sneha Ullal: సినీ ఇండస్ట్రీ అసభ్యకరమని భయపెట్టారు.. అందుకే దూరం పెట్టా!

May 23 2026 11:43 AM | Updated on May 23 2026 11:51 AM

Sneha Ullal: I Entered Bollywood at age of 16

ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్‌ వంటి చిత్రాలతో తెలుగులో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ స్నేహ ఉల్లాల్‌. అయితే ఆమె కెరీర్‌ మొదలైంది మాత్రం హిందీ సినిమాతోనే.. లక్కీ: నో టైమ్‌ ఫర్‌ లవ్‌ (2005) చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది. ఒక్క సినిమాతోనే తన దశ తిరిగిపోయింది. తెలుగు, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంది. మధ్యలో సినిమాలు వదిలేసింది. 

16 ఏళ్లకే ఎంట్రీ
రెండేళ్ల క్రితమే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహా ఉల్లాల్‌ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను సినిమాల్లో అడుగుపెట్టే సమయానికి నా వయసు 16 ఏళ్లే! అప్పుడే పదో తరగతి పూర్తి చేసి కాలేజీలో చేరాను. అక్కడ సల్మాన్‌ సోదరి అర్పిత ఖాన్‌ ఫ్రెండ్స్‌ నన్ను చూశారు. వారు లక్కీ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లారు. బహుశా ఆ సమయంలోనే నా గురించి చెప్పి ఉంటారు. 

అమ్మకు క్యాన్సర్‌
అలా ఆ మూవీ టీమ్‌ నన్ను కలిసింది. ఆ సమయంలో మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు. అమ్మ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటోంది. అందరి ముఖంలోనూ విషాదమే ఉంది. ఈ సినిమా ఛాన్స్‌ ద్వారా అందరికీ కాస్త ఉపశమనం కలిగించాలనుకున్నాను. పైగా అమ్మకు ప్రయాణాలంటే భలే ఇష్టం. షూటింగ్స్‌ కోసం తనను వెంట తీసుకుని వెళ్లొచ్చని సినిమా ఒప్పుకున్నాను.

చాలా కోల్పోయా..
ఈ మూవీ రిలీజయ్యాక నాపై బోలెడంత ప్రేమ కురిపించారు. ఈ ఇండస్ట్రీ నాకెంతిచ్చిందో అంతకంటే ఎక్కువే తీసుకుంది. నా కాలేజీ లైఫ్‌, స్వేచ్ఛను హరించేసింది. 16 ఏళ్ల నుంచి సడన్‌గా పెద్దదాన్నయిపోయాను. టీనేజ్‌ను మిస్‌ అయ్యాను. అయితే చిన్నప్పటి నుంచే నాకు చాలా ఆఫర్లు చవ్చాయి. ఒమన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వాణిజ్య ప్రకటనలో నటించమని అడిగారు. 

ఆ భయంతో దూరం
కానీ ఇండస్ట్రీపై ఉన్న భయంతో వాటిని దూరం పెట్టాను. ఇంట్లోవాళ్లు కూడా ఇండస్ట్రీ అసభ్యకరంగా ఉంటుందని భయపెట్టారు. పైగా నేనంత గ్లామర్‌గా కూడా ఉండనని నా అభిప్రాయం. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు మంచి పాత్రలు ఎంచుకుని మళ్లీ బాలీవుడ్‌లో బిజీ అవాలని ఉంది' అని స్నేహ ఉల్లాల్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: అమ్మ సలహాతో పెళ్లికి ముందు సహజీవనం: నటి

Advertisement
 
Advertisement
Advertisement