పెళ్లికి ముందు సహజీవనం.. అమ్మ సలహానే..: నటి | Tejasswi Prakash Reveals Her Mother Encouraged Live-in Relationship Before Marriage With Karan Kundrra, Read Story Inside | Sakshi
Sakshi News home page

పెళ్లి సంగతి తర్వాత.. ముందు కలిసుండండి.. నటిపై డౌట్‌తోనే!

May 23 2026 9:56 AM | Updated on May 23 2026 10:16 AM

Tejasswi Prakash: My Mom Insisted on live with Karan Kundrra before Marriage

ప్రేమను ఒప్పుకునే పెద్దలు చాలా అరుదు.. కానీ ఈ తల్లి మాత్రం నటి ప్రేమను ఒప్పుకోవడమే కాదు, సహజీవనం చేయమని సలహా ఇచ్చిందట! లివ్‌- ఇన్‌ రిలేషన్‌లోనూ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటే అప్పుడు పెళ్లి చేసుకోమని సెలవిచ్చిందట! ఈ విషయాన్ని బుల్లితెర నటి తేజస్వి ప్రకాశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

బిగ్‌బాస్‌ షోలో లవ్‌ షురూ
హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో కరణ్‌ కుంద్రా- తేజస్వి ప్రకాశ్‌ ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి ఇప్పటివరకు జంటగానే కొనసాగుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న దేశి బ్లింగ్‌ అనే రియాలిటీ షోలో కరణ్‌- తేజస్వి ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ జంట ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కరణ్‌ మాట్లాడుతూ.. తేజస్వి- నేను ప్రేమించుకునే విషయంలో ఆమె తండ్రికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఆమె తల్లి మాత్రం కాస్త డౌట్‌ పడింది. తేజస్విని తాను నమ్మలేనంది. నన్ను ఒకసారి ఆలోచించుకోమని చెప్పింది అన్నాడు.

తల్లి ఐడియానే..
ఇంతలో తేజస్వి మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉందని తలిస్తేనే ముందడుగు వేయమంది. నాతో కరణ్‌ జీవితాంతం కలిసుండగలడో, లేదో చెక్‌ చేసుకోమంది. అందుకే పెళ్లి చేసుకోవడానికి ముందు కలిసుండమని అమ్మ సలహా ఇచ్చింది. నిజానికి ఇలాంటి ఐడియాను ఎవరూ ఒప్పుకోరు. కానీ, మా అమ్మ మాత్రం కలిసి జీవించమని, అప్పుడు కూడా ఇద్దరం బాగానే ఉంటే పెళ్లి చేసుకోమని చెప్పింది అని గుర్తు చేసుకుంది. మరి ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జోడీ ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతుందో చూడాలి!

చదవండి: కేన్స్‌ ముగింపు వేడుకల్లో ఐష్‌

Advertisement
 
Advertisement
Advertisement