'డ్రాగన్', 'పెద్ది'.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటి? | Peddi And Dragon Movie Audience Response | Sakshi
Sakshi News home page

Peddi Vs Dragon: ఒకరోజు వ్యవధిలో వచ్చిన ట్రైలర్, గ్లింప్స్.. స్పందనేంటి?

May 20 2026 9:21 PM | Updated on May 20 2026 9:21 PM

Peddi And Dragon Movie Audience Response

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకరోజు వ్యవధిలో రెండు అప్డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు?

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)

'పెద్ది' ట్రైలర్ విషయానికొస్తే.. మాస్ మూమెంట్స్, పంచ్ డైలాగ్స్ లాంటి వాటికంటే స్టోరీ ఎలా ఉండబోతుందనేది ఫోకస్ చేసి చూపించారు. మెగా అభిమానులు సంతృప్తి చెందారు కానీ సగటు ఆడియెన్స్‌కి మాత్రం ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. యాక్టింగ్ పరంగా చరణ్‌ని వంకపెట్టడానికి లేదు గానీ మాస్ మూమెంట్స్ లాంటివి ట్రైలర్‌లో ఎక్స్‌పెక్ట్ చేశారు. అవి లేకపోవడంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉందన్నట్లు టాక్ వినిపిస్తోంది. భోపాల్, హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్‌లో కొత్త ట్రైలర్ రిలీజ్ చేయొచ్చంటున్నారు. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్స్ కూడా వేయనున్నారు.

'డ్రాగన్' విషయానికొస్తే ఇందులోనూ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ లాంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. డ్రగ్ మాఫియా, అందులోని విలన్స్‌ని చూపించారు. ఎన్టీఆర్ కూడా అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. కానీ ట్రైలర్‌లో అందుకు సంబంధించిన యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ లాంటి వాటికి పెద్దగా చోటివ్వలేదు. మూవీ థియేటర్లలోకి రావడానికి మరో ఏడాది సమయముంది కాబట్టి ఇకపై రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌లో ఫైట్ సీన్స్ లాంటివి ఉండే అవకాశముంది.

ఈ రెండింటిని పోల్చి చూడలేం గానీ రెండింటికి యునానిమస్ టాక్ అయితే రాలేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పలేదు. కొందరికి విపరీతంగా నచ్చేశాయి. మరికొందరికి మాత్రం ఓ మాదిరిగా మాత్రమే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే స్పందన వస్తోంది.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement