పొలిమేర 3 ఆరంభం | Arjun Sarja joins Polimera 3 movie | Sakshi
Sakshi News home page

పొలిమేర 3 ఆరంభం

Jul 28 2026 3:30 AM | Updated on Jul 28 2026 3:30 AM

Arjun Sarja joins Polimera 3 movie

జాన్వీ నారంగ్, వంశీ నందిపాటి, అర్జున్, అనిల్‌ విశ్వనాథ్‌

దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌ తెరకెక్కిస్తున్న ‘పొలిమేర’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న తాజా సినిమా ‘పొలిమేర 3’. ‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి ప్రధాన తారాగణంగా నటì ంచనున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు అర్జున్  భాగం అయ్యారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్‌ నారాయణదాస్‌ నారంగ్‌ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించినట్లు మేకర్స్‌ తెలిపారు.

నారాయణదాస్‌ నారంగ్‌ ఆశీస్సులతో వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్‌ ‘పొలిమేర 3’ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి. సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్  చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత బన్నీ వాసు, ఎగ్జిబిటర్‌ సదానంద్‌ గౌడ్‌ యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో  నిర్మాతలు సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement