ప్రభుదేవా-సిమ్రాన్‌.. కమల్‌ శ్రీదేవి | Prabhudeva And Simran Join Hands For Their Upcoming Family Love Story Titled Kamal Sridevi | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా-సిమ్రాన్‌.. కమల్‌ శ్రీదేవి

Oct 26 2026 8:55 AM | Updated on Oct 26 2026 9:45 AM

Prabhudeva And Simran New Movie Titled Kamal Sridevi

కొన్ని చిత్రాల టైటిల్సే ప్రేక్షకులని థియేటర్లకు రప్పిస్తాయి. అలాంటి ఆసక్తికరమైన పేరుతో తీస్తున్న సినిమా ఇది. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు రెడీ అయిన దీని టైటిల్ కమల్‌ శ్రీదేవి. ఇంతకుముందు కమల్, శ్రీదేవి జంటగా నటించిన పలు చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ఇప్పుడు వారి పేర్లతో సౌందర్య రజనీకాంత్‌కు చెందిన జియోన్‌ ఫిలింస్‌, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కలిసి చేసిన మూవీ ఇది.

(ఇదీ చదవండి: బన్నీ సినిమా దెబ్బకు ఎన్టీఆర్‌కి జెలసీ!)

ప్రభుదేవా, సిమ్రాన్‌ జంటగా ఈ మూవీలో నటిస్తున్నారు. కృష్ణానంద్ కొట్టారపట్టు దర్శకుడు. ఇది కుటుంబ నేపధ్యంలో సాగే విభిన్న ప్రేమకథగా ఉండనుంది. తమిళంలో పలు వైవిధ్యభరిత చిత్రాలను నిర్మిస్తున్న ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్‌. ఈ సంస్థ ఇంతకుముందు గుడ్‌నైట్‌, లవర్‌, ట్యూరిస్ట్‌ ఫ్యామిలి వంటి విజయవంతమైన చిత్రాలని నిర్మించారు. జియోన్‌ ఫిలింస్‌, ఎంఆర్‌పీ ఎంటర్‌ టెయిన్‌మెంట్‌ సంస్థలు ఇంతకు ముందు నిర్మించిన విత్‌ లవ్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో తాజా చిత్రం కమల్‌ సిమ్రాన్‌పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 

(ఇదీ చదవండి: త్రిష.. ఆ నవ్వుకి అర్థమేంటో?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement