రేపే రామ్ చరణ్ RC17 ముహూర్తం.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరంటే? | Ram Charan-Sukumar's RC17 to Begin on November 1 Pooja Ceremony Confirmed | Sakshi
Sakshi News home page

RC17: రేపే రామ్ చరణ్ RC17 ముహూర్తం..

Oct 31 2026 3:01 PM | Updated on Oct 31 2026 3:12 PM

Ram Charan-Sukumar's RC17 to Begin on November 1 Pooja Ceremony Confirmed

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 1న లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలుపెట్టనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత రవిశంకర్‌ వెల్లడించారు. దీంతో చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్టుపై మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

‘RC17’(వర్కింగ్‌ టైటిల్‌)ను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ సమర్పిస్తోంది. గతంలో సుకుమార్‌, రామ్‌ చరణ్‌ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి నెలకొంది.

దేవిశ్రీ ప్లేస్‌లో అనిరుధ్‌?
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుకుమార్‌ గత చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ కాకుండా ఈసారి అనిరుధ్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూజా కార్యక్రమం రోజు హీరోయిన్‌తో పాటు సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. 

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్లకు షాక్.. #RC17లో ఛాన్స్ ఈమెకా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement