స్టార్ హీరోయిన్లకు షాక్.. #RC17లో ఛాన్స్ ఈమెకా? | Sathvika Veeravalli In Ram Charan And Sukumar Movie | Sakshi
Sakshi News home page

RC 17 Movie: తొలి సినిమా రిలీజ్ కాలేదు.. అంతలోనే చరణ్‌తో?

Oct 31 2026 2:49 PM | Updated on Oct 31 2026 2:55 PM

Sathvika Veeravalli In Ram Charan And Sukumar Movie

'ఆర్ఆర్ఆర్' లాంటి సూపర్ హిట్ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్' చేశాడు. ఇది దారుణంగా నిరాశపరిచింది. దీంతో మెగా అభిమానులు ఆశలన్నీ 'పెద్ది' మీద పెట్టుకున్నారు. కానీ ఇది కూడా పూర్తిగా మెప్పించలేకపోయింది. దీంతో ఇక సుకుమార్ సినిమాతో చరణ్ అదిరిపోయే రచ్చ చేస్తాడని ఫిక్స్ అవుతున్నారు. అందుకు తగ్గట్లే ఒక్కో అప్‌డేట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’.. నిర్మాత ఆవేదన)

రేపు అనగా ఆదివారం(నవంబర్ 01).. హైదరాబాద్‌లో #RC17 సినిమా లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ మూవీకి అనిరుధ్ సంగీతమందించనున్నాడని ఇప్పటికే ఓ లీకైంది. ఇప్పుడు హీరోయిన్ పేరు కూడా బయటకొచ్చేసింది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి.. ‍త్వరలో 'ఆకాశంలో ఒక తార' అనే తెలుగు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు ఈమెకే చరణ్ సరసన నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

సాత్వికతో పాటే భాగ్యశ్రీ బోర్సే, 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీళ్లలో ఎవరు ఫిక్స్ అయ్యారనేది లాంచింగ్ ఈవెంట్‌లో బయటపెడతారేమో చూడాలి? మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. క్రేజీ కాన్సెప్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement