దూసుకెళ్తున్న నవీన్‌ చంద్ర.. అప్పుడే మరో కొత్త సినిమా! | Naveen Chandra New Film Karaali Launched Grandly with Pooja Ceremony | Sakshi
Sakshi News home page

ఇద్దరు హీరోయిన్లతో నవీన్‌ చంద్ర కొత్త చిత్రం.. టైటిల్‌ ఇదే

May 18 2025 3:57 PM | Updated on May 18 2025 4:29 PM

Naveen Chandra New Film Karaali Launched Grandly with Pooja Ceremony

హీరో నవీన్‌ చంద్ర వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య లెవన్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ టాలెంటెడ్‌ హీరో..తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘కరాలి’అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.  రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమ‌తి మంద‌ల‌పు  ప్ర‌వ‌ల్లిక స‌మ‌ర్ప‌ణ‌లో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ మీద  మంద‌ల‌పు శివకృష్ణ నిర్మిస్తున్నారు. రాశీసింగ్‌, కాజల్‌ చౌదరి హీరోయిన్లు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి సాహు గార‌పాటి క్లాప్ కొట్ట‌గా, శ్రీహ‌ర్షిణి ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ అధినేత గోరంట్ల ర‌వికుమార్‌, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తుమాటి న‌ర‌సింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  నవీన్ చంద్ర మాట్లాడుతూ... ‘కొత్త వారు కొత్త పాయింట్‌తో వచ్చినప్పుడు సినిమాలు నిర్మించేందుకు శివ గారి లాంటి ధైర్యం ఉన్న వాళ్లు ముందుకు రావాలి. ‘కరాలి’ అనే టైటిల్ ఎంత కొత్తగా, డిఫరెంట్‌గా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇంత వరకు నేను చేయని ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామా. కాజల్ చౌదరి నటించిన ‘అనగనగా’ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మా సినిమాకు మంచి టీం దొరికింది. ఇంత వరకు నన్ను ఆడియెన్స్, మీడియా ఎంకరేజ్ చేస్తూనే వచ్చింది. ఈ మూవీని ఆడియెన్స్ అంతా ఎంజాయ్ చేసేలా రూపొందిస్తున్నామ’ని అన్నారు.

‘నేను చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో నిర్మించేందుకు వచ్చిన శివ గారికి థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మేం చాలా నమ్మకంగా ఉన్నాం’ అని చిత్ర దర్శకుడు రాకేష్‌ పొట్టా అన్నారు.

నాకు స్క్రిప్ట్ చాలా నాకు నచ్చింది. నవీన్ చంద్ర గారి సినిమాలు, ఆయన ఎంచుకునే కథలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఈ మూవీతో మంచి కథతో మీ అందరి ముందుకు రాబోతోన్నాం’అని హీరోయిన్‌ కాజల్‌ చౌదరి అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement