‘రాజు గాని సవాల్‌’ కోసం ఎదురు చూస్తున్నా : డింపుల్‌ హయతి | Raju Gani Saval Trailer Released By Dimple Hayathi, Rashi Singh | Sakshi
Sakshi News home page

‘రాజు గాని సవాల్‌’ ట్రైలర్‌ బాగుంది.. సినిమా హిట్‌ కావాలి: డింపుల్‌ హయతి

Jul 19 2025 3:58 PM | Updated on Jul 19 2025 4:04 PM

Raju Gani Saval Trailer Released By Dimple Hayathi, Rashi Singh

లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా ‘రాజు గాని సవాల్’. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న ఈ చిత్రం రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని  హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ - "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో కలిసిన సినిమా మీద ప్రేమ ఉన్న ముగ్గురు వ్యక్తులు బాపిరాజు గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు.  ఈ అమ్మాయి బాగుంటుందని నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు ఈ ముగ్గురు. "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు మీరు వస్తారా అని బాపిరాజు గారు అడిగినప్పుడు తప్పకుండా వస్తా సార్ అని చెప్పాను. బాపిరాజు గారు సినిమాను సినిమాను రూపొందించడమే కాదు ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అయ్యేలా చేస్తారు. "రాజు గాని సవాల్" సినిమా సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ రిలీజ్ కోసం నేనూ ఎదురుచూస్తున్నా. అన్నారు.

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్ కు వచ్చే ముందే "రాజు గాని సవాల్" సినిమా ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ. హీరో రవీందర్ గారితో పాటు రితిక, సంధ్య బాగా నటించారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. బాపిరాజు గారి నమ్మకాన్ని ఈ మూవీ నిలబెట్టాలి. "రాజు గాని సవాల్" సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ  కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement