బాప్తిస్మం అంటే ఏమిటి? అసలు అర్థం ఇదే! | Baptism Meaning Importance Jesus Christ | Sakshi
Sakshi News home page

బాప్తిస్మం అంటే ఏమిటి? అసలు అర్థం ఇదే!

Sep 3 2026 8:57 AM | Updated on Sep 3 2026 8:57 AM

Baptism Meaning Importance Jesus Christ

సువార్త

విశ్వవ్యాప్తంగా రెండు వేల సంవత్సరాల నుండి ఉన్న క్రైస్తవ సమాజానికి మౌలికమైన రెండు సంస్కారాలను యేసు ప్రభువు సూచించారు. ఒకటి పరిశుద్ధ సమభాక్తము. రెండు పరిశుద్ధ బాప్తిస్మం. దీనిని వేదాంత పండితులు దివ్యస్నానం అన్నారు. ఒకసారి జరిగిన వేదాంత సమావేశంలోని పెద్దలు బాప్తిస్మమునకు ప్రతినామంగా దివ్యస్నానమును నిశ్చయించారు. దీనిని కేథలిక్‌ సంఘం వారు జ్ఞానస్నానమంటారు.

వాస్తవంగా బాప్తిజోమ్‌ అనే గ్రీకు భాషలోని పదం, తెలుగు భాషలో బాప్తిస్మం లేదా జ్ఞానస్నానం అంటారు. ఇంకా కొన్ని ్ర΄÷టెస్టెంట్‌ సంఘాల గురువుల సమావేశాల్లో ఇంకా అదనంగా ఏడు సంస్కారాలు/సాంప్రదాయాలు నిర్ణయించారు. అప్పటి ఉమ్మడి తెలుగు ప్రాంతాలైన చిత్తూరు మొదలు అదిలాబాద్‌ ప్రాంతానికి క్రీ.శ. 1842 నుండి మాత్రమే క్రైస్తవ విశ్వాసం ప్రవేశించిందన్నది బైబిలు గురువుల అభి్రపాయ సారాంశం.

నీకొదేము సంభాషణ:
ఒకసారి యూదుల అధికారిౖయెన నీకొదేమను పరిసయ్యడు, అతడు రాత్రియందు యేసు ప్రభువు  వద్దకు వచ్చాడు. ఆయన తో – బోధకుడా... నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని తెలుసు. దేవుడు మీకు తోడై యుంటేనే గానీ నీవు చేస్తున్న సూచక క్రియలను ఎవరునూ చేయలేరన్నాడు. ప్రభువు వానితో ‘‘ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను’’ అని అన్నారు.

అందుకు నీకొదేము ‘‘ముసలివాడైన మనుష్యుడేలాగు రెండవసారి గర్భం నుండి జన్మింపగలడ’’ని ఆయనతో అన్నాడు. యేసుప్రభువు ఈ విధంగా అన్నాడు. ‘‘ఒకడు నీటి మూలంగానూ, ఆత్మ మూలంగానూ జన్మిస్తేనే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాన’’ని అన్నాడు.

పునీత అగస్టీన్‌ ఈ బాప్తిస్మం అనే ప్రక్రియను బాహ్యంగానూ అంతరంగంలోనూ జరిగే ప్రక్రియ అన్నారు. దీనినే ప్రక్షాళన, కడగబడటం అంటారు. బా΄్తోమ్‌ (గ్రీకు) అనగా శుద్ధి చేసుకోవటం.
సర్వశక్తిమంతుడైన భగవంతునిపై భక్తితో శరణాగతి కలిగి యుండటం. యూదులు దేవాలయంలోనికి ప్రవేశించే ముందు ప్రథమభాగంలో పాప పరిహారార్థం బలులు అర్పణ చేసి గంగాళంలోని నీళ్ళతో శుభ్రపరచుకొని ప్రవేశిస్తారు.

ఇవి కూడా చదవండి: ఒక్క ప్రశ్న.. మారిపోయిన ఓ యువకుడి జీవితం!

భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతిలో గ్రామ ప్రాంత దేవాలయంలోనికి ప్రవేశించే ముందు చెరువులో స్నానం చేసి, చెరువుగట్టు సమీపంలో వున్న దేవాలయంలోనికి ప్రవేశిస్తారు. అంతరంగ శుద్ధీకరణ అనేది ఒక్కసారే జరగాలి. అది పైనుండి జరిగే క్రియ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల అభిషేకం జరగాలి. ఎందుచేత అంటే ఏక దేవుని నామమున, ఏకత్వం అయిన త్రిత్వదేవునిచే జరిగే ఆత్మప్రక్షాళన. బాప్తిస్మం, సమబాప్తం ఈ రెండు సూత్రాలు క్రైస్తవ సమాజానికి, సంఘానికి పునాది. (ఫౌండేషన్‌). దైవకార్యార్థ సేవ (మిషన్‌), అనగా 1. బోధన (టీచింగ్‌), 2. ప్రబోధ (ప్రీచింగ్‌), 3. స్వస్థత (హీలింగ్‌) (టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్‌).

ఆ దినములలో (క్రీ.శ. తొలిదశ) బాప్తిస్మమిచ్చు యోహాను పరలోక రాజ్యం సమీపించి ఉంది. మారు మనస్సు పొందుడని ప్రకటిస్తున్నప్పుడు యూదులందరూ పాపాలను ఒప్పుకొని బాప్తిస్మం పొందారు. ఆ సమయంలో  బాప్తిస్మం పొందటానికి యేసుప్రభువు గలిలయ నుండి యోర్దాను దగ్గర వున్న యోహాను దగ్గరకు వచ్చాడు. అప్పుడు యోహాను ‘‘నేను మీ చేత బాప్తిస్మం పొందవలసినవాడనై వుండగా మీరు నా దగ్గరకు వచ్చితిరా?’’ అని ఆయనను నివారింప జూశాడు. కానీ ప్రభువు ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగున నెరవేర్చుట మనకు తగియున్నది కావున ఆయనను జరిగించమ’’న్నాడు. కనుక ఆయన అలాగు చేశాడు.

యేసు ప్రభువు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు రాగా ఆకాశంనుంచి దేవుని ఆత్మ పావురంలా యేసుప్రభువు దగ్గరకు రావడం చూశాడు యోహాను. ‘‘ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేనానందిస్తున్నానన్న’’ శబ్దం ఆకాశం నుండి వచ్చింది. (పరి. ముత్త 3:13:17).

గురువు/ప్రీస్ట్‌/పాస్టరు నీటిలో ముంచి తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ పేరిట వారికి బాప్తిస్మం/దివ్యస్నానం ఇవ్వటం, మారు మనస్సు పొందినవారికి త్రియేక దేవుని నామం పేరిట పరి. బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. శరీరానికి, ఆత్మకు, ఆత్మకు, శరీరానికి జరిగే పోరాటంలో జయించిన వారే తమను తాము జయించినవారు. యేసుక్రీస్తు వారు అన్ని విషయాలలో మనవలె జీవించాడు. ఒక్క పాపం విషయంలో తప్ప. అటువంటి బాధ్యత పునీతులు, తమను తాము జయించుకున్నవారే పరలోక రాజ్యానికి అర్హులు. అది యేసు వారు దైవకుమారుడైనందుననే లోకాన్ని జయించాడు. తనను తాను రిక్తునిగా చేసుకుని తండ్రియైన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అటువంటి ధన్యత, భాగ్యం మనకనుగ్రహించును గాక. ఆమెన్‌!
– కోట బిపిన్‌ చంద్రపాల్‌

  • నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement