అమ్మ.. అసలైన అందం ఇదీ.. | Miss Uganda 2026 Elle Muhoza C-Section Inspired Gown | Sakshi
Sakshi News home page

అమ్మ.. అసలైన అందం ఇదీ..

Sep 3 2026 1:58 AM | Updated on Sep 3 2026 1:58 AM

Miss Uganda 2026 Elle Muhoza C-Section Inspired Gown

బిడ్డ అడ్డం తిరిగింది ఆపరేషన్‌ చేయాలి అంటే సరే చేసేయండి అని భర్త అవసరమైన డాక్యుమెంట్ల మీద సంతకం పెడతాడు. ఇది మనం నిత్య జీవితంలోనూ, సినిమాల్లోనూ చాలాసార్లు  చూశాం. కానీ సంతకం పెట్టినంత సులువు కాదు సిజేరియన్‌ ఆపరేషన్‌ అంటే.. చర్మం, కొవ్వు, కండరాన్ని తొలుచుకుంటూ ఏడు పొరలు దాటుకుంటూ తల్లి గర్భంలోకి వెళ్లి బిడ్డను సురక్షితంగా ఈ లోకంలోకి తీసుకురావాలి. 

మాతృత్వం కోసం తల్లి వెచ్చించాల్సిన గొప్ప ఖరీదు ఇది. ఈ విషయాన్ని చెప్పేందుకే ఉగాండ అందాల పోటీ వేదికగా మారింది. ట్రివియా ఎల్లె ముహోజా మిస్‌ ఉగాండ 2026గా లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో రూపొందించిన ఓ గౌనును ధరించి వేదిక మీదకి వచ్చింది. ప్రసవం, మాతృత్వం, స్త్రీల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ఎంతో భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దిన ఈ కాస్ట్యూమ్‌ సోషల్‌ మీడియాలో ప్రశంసలందుకుంటోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement