న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హస్తినలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రముఖ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్‌ఆర్‌సీసీ)ని సందర్శించనున్నారు.
అదే రోజు జరిగే కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. యువతతో మమేకం కావాలన్న బీజేపీ లక్ష్యానికి చేరుక కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని మోదీ ఈ శనివారం కాలేజీ విద్యార్థులనుద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది. చివరిసారిగా 13 సంవత్సరాల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఈ కాలేజీని మోదీ సందర్శించారు.


