భారత్‌లో ట్రంప్‌ కుమార్తె.. అబ్బురపోయే అనుభూతి | Trump's daughter touring India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ట్రంప్‌ కుమార్తె.. అబ్బురపోయే అనుభూతి

May 31 2026 5:28 AM | Updated on May 31 2026 5:40 AM

Trump's daughter touring India

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు కుమార్తె  టిఫానీ ట్రంప్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. తన భర్త మైఖేల్ బౌలోస్‌తో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ఆమె..  ఢిల్లీలోని చారిత్రాత్మక బాప్స్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.  అనంతరం  ఆగ్రాలోని తాజ్ మహల్‌తో పాటు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ వెళ్లారు.  

టిఫానీ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా తన భర్త మైఖేల్ బౌలోస్, స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ బీఏపీఎస్ స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు టిఫానీ ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా  అక్షరధామ్ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను, కట్టడాలను టిఫానీ దంపతులు మంత్రముగ్దులయ్యారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పూలమాలలు ధరించి వారు  ఫోటోలు దిగారు. ఆచిత్రాలను  టిఫాని తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకున్నారు.  ‘‘భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని అన్వేషించడానికి ఇదొక అద్భుతమైన రోజు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదొక మరువలేని అద్భుతమైన అనుభూతి అని ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement