లక్నో: ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కి AIMIM నేత షాదాబ్ చౌహాన్ కీలక సూచన చేశారు. అఖిలేష్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే తప్పనిసరిగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు తీసుకోవాల్సిందేనన్నారు. అలా లేకపోతే ముఖ్యమంత్రి కావాలని ఆయన కలలు కనలేరని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి పొలిటికల్ పార్టీలు అధికారమే లక్షంగా వ్యుహా ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేసిన ‘PDA’ రాజకీయ వ్యూహాం లక్షంగా షాదాబ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. PDA అంటే ‘పిఛ్‌డే, దళిత్, అల్పసంఖ్యాక్’ — అంటే వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు అని సమాజ్‌వాదీ పార్టీ వివరిస్తోంది.
పీడీఏలోని A పదం అసదుద్దీన్ ఓవైసీనిని సూచించేలా ఉండాలని షాదాబ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. “అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే, ఆయన అసదుద్దీన్ ఒవైసీ మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది అఖిలేష్ యాదవ్ PDAలో ‘A’ అంటే అసదుద్దీన్ ఒవైసీ ఉండే వరకు, ఆయన అధికారంలోకి రావాలని కలలు కూడా కనలేరు” అని అన్నారు.
ముస్లింలు తమ ఓట్లు తమ ప్రయోజనాలను ప్రతిబింబించే నాయకుడిని ఎన్నుకునేలా ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారని అఖిలేష్ యాదవ్ రాజకీయ వ్యూహం అసదుద్దీన్ ఒవైసీ లేకుండా పూర్తికాదన్నారు. AIMIM ఉత్తరప్రదేశ్‌లో ఒక ముఖ్యమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా కొనసాగుతోందని, అఖిలేష్ యాదవ్ తన ఎన్నికల అవకాశాలను బలోపేతం చేసుకోవాలంటే ఒవైసీ పార్టీతో సహకారం అవసరమని ఆయన సూచించారు.


