ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. 8 మంది అరెస్ట్ | delhi isi agents arrested terror plot foiled explosives seized | Sakshi
Sakshi News home page

ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. 8 మంది అరెస్ట్

May 31 2026 12:18 AM | Updated on May 31 2026 12:18 AM

 delhi isi agents arrested terror plot foiled explosives seized

ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్‌ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. ఆ దేశ  గూఢచార సంస్థ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం, షాజాద్ భట్టి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఎనిమిది మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేశారు.  వారి వద్ద కీలకమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, విజయ్ అలియాస్ షూటర్‌కు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లలో ఉగ్రవాద, నేర కార్యకలాపాలు నిర్వహించే  కీలక బాధ్యతను పాక్‌ ఉగ్రవాద సంస్థ అప్పగించింది. దీంతో  ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోయూలో ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్, చండీగఢ్‌లలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, మంత్రిత్వ శాఖలు, భద్రతా దళాలపై దాడులకు వారు కుట్ర పన్నుతున్నారని పోలీసులు తెలిపారు. 

నిందితులందరూ పాకిస్తాన్, దుబాయ్‌లలోని హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. వీరిలో ప్రధాన నిందితుడి కోసం గాలింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ అలియాస్ షూటర్, జార్ఖండ్‌కు చెందిన నితీష్ పాశ్వాన్, మహారాష్ట్రకు చెందిన తౌకీర్ రిజ్వాన్ అహ్మద్ షేక్ మరియు సాజిద్ మెహబూబ్ షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్, పంజాబ్‌కు చెందిన హర్విందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్, మంజీత్ సింగ్, నేపాల్ పౌరుడు అంగ్ కమీ లామాలు ఉన్నారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రి, గ్రానైట్లు,  బైకులు, మెుబైల్‌ ఫోన్లు స్వాధీనం  చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement