35 వేల అడుగుల ఎత్తులో షాక్.. విమానం డోర్ తెరవబోయిన సైకో | Shock at air Psycho opens plane door | Sakshi
Sakshi News home page

35 వేల అడుగుల ఎత్తులో షాక్.. విమానం డోర్ తెరవబోయిన సైకో

Aug 7 2026 1:42 PM | Updated on Aug 7 2026 1:52 PM

Shock at air Psycho opens plane door

తిరువనంతపురం: ఒక సైకోచేసిన వింతఘటన ఆ విమానంలోని ప్రయాణికులందరినీ ఊపిరి బిగపట్టుకునేలా చేసింది. బాటిక్ ఎయిర్ కు చెందిన OD-231 విమానం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వస్తుంది. అంతా ప్రయాణంలో సేదతీరుతుండగా ఒక్కసారిగా అందులోని ప్రయాణికుడు అకస్మాత్తుగా తన సీటు నుంచి లేచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు.దీంతో అందులోని వారంతా ఒక్కసారిగా తీవ్రభయాందోళనలకు గురయ్యారు.

ఏం జరిగింది?
విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో, 36 ఏళ్ల జంషీర్ అతనిక్కల్ అనే ప్రయాణికుడు అకస్మాత్తుగా తన సీటు నుంచి లేచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు.అంతే కాకుండా తలుపు వద్ద ఉన్న విండో ప్యానెల్‌ను కూడా బలంగా కొట్టి దెబ్బతీశాడు. దీంతో ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు.క్యాబిన్ క్రూ వెంటనే స్పందించి, కొంతమంది ప్రయాణికుల సహాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

అయితే విమానం క్రూజింగ్ ఎత్తులో ఉండగా క్యాబిన్ లోపలి–బయటి గాలి పీడన మధ్య భారీ తేడా ఉండటంతో ఎమర్జెన్సీ తలుపు తెరవడం సాధారణంగా సాధ్యం కాలేదు దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే విమానం కొచ్చిలో ‍ల్యాండ్‌ అయిన అనంతరం అతడిని సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అతడి మానసిక పరిస్థితి, ఇతర కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement