పర్యావరణ అనుమతులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు | Supreme Court key verdict on environmental clearances | Sakshi
Sakshi News home page

పర్యావరణ అనుమతులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Jul 29 2026 7:07 PM | Updated on Jul 29 2026 7:17 PM

Supreme Court  key verdict on environmental clearances

సాక్షి, ఢిల్లీ : పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు,  పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం  ఒక సాధారణ మెమోరాండమ్ (OM) ద్వారా పోస్ట్-ఫాక్టో (ముందు పని తరువాత అనుమతి) కుదరదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం జారీ చేసిన 2021 ఆఫీస్ మెమోరాండమ్‌ను రద్దు చేసింది.

ఫాస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీస్ మెమోరాండం మాత్రమే సరిపోదని తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. చట్టబద్ధ నోటిఫికేషన్  ద్వారా అవసరమైతే పోస్ట్-ఫాక్టో (తర్వాతి దశలో) పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన నోటిఫికేషన్ జారీ చేసి పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతుల వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉంది.

ఈ కేసు వివరాలు

2006 నాటి పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల ప్రకారం ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా ముందస్తు పర్యావరణ అనుమతి తప్పనిసరిగా ఉండేది.  అయితే, ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా పనులు ప్రారంభించిన కంపెనీలు/ప్రాజెక్టులకు, తదనంతరం (పోస్ట్-ఫాక్టో) అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో ఒక నోటిఫికేషన్, 2021లో ఒక ఆఫీస్ మెమోరాండమ్ (OM) జారీ చేసింది.

"వనశక్తి" అనే పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం — చట్టబద్ధమైన పర్యావరణ నిబంధనలను కేవలం కార్యాలయ ఉత్తర్వుల (OM) ద్వారా సవరించడం చెల్లదని, ఇది పర్యావరణ చట్టాల ఆశయానికి విరుద్ధమని పేర్కొంటూ 2021 OMను కొట్టివేసింది.  అయితే, ఇప్పటికే గత అనుమతుల ఆధారంగా మొదలైన ప్రాజెక్టులు దెబ్బతినకుండా పాత అనుమతులను సమర్థించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement