80 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా.. ఎర్రకోటపై సరికొత్త చరిత్ర | vande mataram played for 1st time during independence day | Sakshi
Sakshi News home page

80 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా.. ఎర్రకోటపై సరికొత్త చరిత్ర

Aug 15 2026 7:48 AM | Updated on Aug 15 2026 7:54 AM

vande mataram played for 1st time during independence day

ఢిల్లీ: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ  ఢిల్లీలోని ఎర్రకోటపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా జాతీయ గేయం ‘వందే మాతరం’ను పూర్తిస్థాయిలో ఆలపించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా  వందేమాతరంపై ప్రత్యేక చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘వందే మాతరం’కు అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించే మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న (శుక్రవారం) స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ముందు, ముగింపులోనూ  ‘వందే మాతరాన్ని గేయాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వదేశీ ఉద్యమ కాలంలో ‘వందే మాతరం’ ప్రజల గీతంగా మారిందని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ‘వందే మాతరం’ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేసిన ప్రధాన దేశభక్తి గీతాల్లో దీని ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దేశభక్తి, మాతృభూమిపై గౌరవం, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా ఈ గీతం ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. 2026లో 150 ఏళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో దీని చారిత్రక ప్రాధాన్యాన్ని దేశవ్యాప్తంగా గుర్తుచేస్తున్నారు. ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ‘వందే మాతరం’కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement