స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ : ఖలిస్తాన్‌ బెదిరింపుల కలకలం | Delhi High Court, IGI Airport Receive Bomb Threat Ahead of Independence Day | Sakshi
Sakshi News home page

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ : ఖలిస్తాన్‌ బెదిరింపుల కలకలం

Aug 14 2026 2:29 PM | Updated on Aug 14 2026 2:35 PM

Delhi High Court Airport Receive BombThreat Day Before Independence Day

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ 80వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలకు బాంబు బెదరింపు కలకలం రేపింది. శుక్రవారం నాడు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక ఇతర ప్రదేశాలకు ఖలిస్తాన్ పేరుతో  బాంబు బెదిరింపు ఈమెయిల్‌ వచ్చింది. ఢిల్లీని ఖలిస్తాన్‌గా మారుస్తామని ఆ బెదిరింపు ఇమెయిల్‌లో పేర్కొన్నారు.

సిక్కుల కోసం ఖలిస్తాన్ అనే పేరుతో ఒక స్వతంత్ర సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకునే వేర్పాటువాద ఉద్యమ ఖలిస్తాన్ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారని ఆ ఇమెయిల్‌లో పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 2:11 గంటలకు ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుతుంది, ఆ తర్వాత గంటకే జిల్లా కోర్టులలో పేలుళ్లు జరుగుతాయి. ఢిల్లీ కోర్టులు సిక్కులకు వ్యతిరేకంగా ఉన్న కేసులను మాత్రమే వింటాయంటా విమర్శలు గుప్పించడం గమనార్హం. జామ్‌నగర్ హౌస్, ఝండేవలన్ భవనం, సాకేత్ కార్యాలయం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్ 3, ఢిల్లీ కంటోన్మెంట్‌లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) కార్యాలయంతో సహా మరో ఆరు ప్రదేశాలకు కూడా బెదిరింపులొచ్చినట్టు సమాచారం. ఢిల్లీ మెట్రో, అంబాలా వెళ్లే రైళ్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారును భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రాంతాలకు అగ్నిమాపక వాహనాలను పంపారు. అయితే ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. 

ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement