మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం | Mamata Banerjee's niece Bristy Mukherjee found dead at Birbhum house | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం

Sep 1 2026 4:09 PM | Updated on Sep 1 2026 4:21 PM

Mamata Banerjee's niece Bristy Mukherjee found dead at Birbhum house

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ రోజు (మంగళవారం) ఆమె మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  

రాంపూర్‌హాట్ ప్రాంతంలోని కుసుంబా గ్రామంలో ఉన్న తన ఇంటి రెండో అంతస్తులోని ఓ గదిలో బ్రిస్టీ ముఖర్జీ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని  పోస్టుమార్టం పరీక్ష కోసం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులు మాట్లాడుతూ  ఆమె మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర న్యాయపరమైన, విధి సంబంధిత విచారణలు పూర్తయిన తర్వాత ఆమె మరణానికి దారితీసిన అసలు పరిస్థితులు స్పష్టమవుతాయని పోలీసు అధికారి తెలిపారు.

అయితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, బ్రిస్టీ ముఖర్జీ కొంతకాలంగా విడాకుల ప్రక్రియను ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, అందుకు చికిత్స సైతం తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

బ్రిస్టీ ముఖర్జీ తండ్రి నిహార్ ముఖర్జీ. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం బ్రిస్టీ ముఖర్జీ మృతికి సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర విధి సంబంధిత విచారణల ఆధారంగా ఆమె మరణానికి దారితీసిన పూర్తి పరిస్థితులను నిర్ధారించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement