ఎస్పీలో చీలికలు.. అఖిలేష్‌ రియాక్షన్ | SP is fully prepared, Akhilesh hits back at Rajbhar | Sakshi
Sakshi News home page

ఎస్పీలో చీలికలు.. అఖిలేష్‌ రియాక్షన్

Jun 17 2026 4:27 PM | Updated on Jun 17 2026 5:19 PM

SP is fully prepared, Akhilesh hits back at Rajbhar

లక్నో: సమాజ్‌ వాద్‌ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ బీజేపీకి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. SP  అన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని బీజేపీకి ఎదురు నిలిచిందన్నారు. అంతర్గతంగా ఎన్ని సంక్షోభాలను సృష్టించినా వాటిని ఎదుర్కొనేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ఎస్పీలో చీలికలు మెుదలయ్యాయి. అఖిలేష్‌ అరెస్టు కాబోతున్నారని బీజేపీ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు (బుధవారం) అఖిలేష్‌ యాదవ్ బదులిచ్చారు.

యూపీ మంత్రి ప్రకాశ్ రాజ్‌ భర్‌ సమాజ్‌ వాద్‌ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. "త్వరలో సమాజ్ వాదీ పార్టీలో ఒక పెద్ద చీలిక రాబోతోంది. ఇప్పటికే ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు .మైనింగ్ కేసులో సీబీఐ అఖిలేష్ యాదవ్ పేరు ఉందని త్వరలోనే జైలుకు వెళ్తారు..మహారాష్ట్ర, బెంగాల్ తర్వాత ఎస్పీ బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు." అని అన్నారు. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఈ అంశంపై స్పందించారు.

అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.." బీజేపీ చీలికలు, ఫిరాయింపులను రాజకీయ వ్యూహంగా పదేపదే ఉపయోగించుకుంది. పలు పార్టీలలో సంక్షోభం సృష్టించింది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, చివరికి రాజ్యసభకు వెళ్లిన నాయకులను కూడా అది తనవైపు లాక్కుంది. దురాశ, అంతర్గత శక్తులతో నడిచే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు, కానీ అటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సమాజ్‌వాదీ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉంది." అని ఆయన అన్నారు

ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఎస్పీ బలమైన పార్టీగానే నిలిచిందని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఒక బలమైన సంస్థ అని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాము  బీజేపీని సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అఖిలేష్‌ తేల్చి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement