మరోసారి కేంద్ర క్యాబినేట్ భేటీ .. కీలక నిర్ణయాలు? | Cabinet meeting chaired by the Prime Minister | Sakshi
Sakshi News home page

మరోసారి కేంద్ర క్యాబినేట్ భేటీ .. కీలక నిర్ణయాలు?

Jul 31 2026 11:55 AM | Updated on Jul 31 2026 12:13 PM

Cabinet meeting chaired by the Prime Minister

సాక్షి, ఢిల్లీ: ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) సమావేశం కానుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, తాజా బిల్లుల వ్యూహాలపై  ఈ భేటీలో చర్చించనుంది. కాగా  నిన్న రాత్రి ప్రధాని మోదీ అత్యంత కీలకమైన భద్రతపై క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇంతలోనే క్యాబినేట్ మరోసారి సమావేశం కానుంది.

ఈ రోజు జరగబోయే భేటీలో ఇటీవల ఆమోదం పొందిన జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు-2026, పేపర్ లీకేజీల నిరోధక బిల్లు  వంటి కీలక అంశాలపై తదుపరి పార్లమెంటరీ వ్యూహాలను ఖరారు చేయనున్నారు.దానితో పాటు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల దిగుమతులకు ఆటంకం కలగవచ్చు. దేశంలోని రైతులకు రాబోయే రబీ సీజన్‌లో ఎరువుల కొరత రాకుండా, ప్రత్యామ్నాయ దేశాల నుంచి స్టాక్‌ను తెప్పించుకునే వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా నిన్న జరిగిన భేటీలో పశ్చిమాసియాలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు భారత రక్షణ, ఆర్థిక రంగాలపై దాని ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయ నావికులకు, ప్రవాస భారతీయుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఆదేశించారు. వారి కుటుంబాలకు సమాచారం, అత్యవసర సహాయం అందించేందుకు ప్రత్యేక సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.

అదే విధంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ముడిచమురు, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినేట్ మరోసారి భేటీ కాబోతుంది.కాగా విపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ ఆగస్టు 3వరకూ వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement