సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన ఎమ్మెల్యేలు | TMC mlas fall in line meeting at mamata banerjees house | Sakshi
Sakshi News home page

సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన ఎమ్మెల్యేలు

Jun 5 2026 7:47 PM | Updated on Jun 5 2026 8:44 PM

 TMC mlas fall in line meeting at mamata banerjees house

కోల్‌కతా: మమతా బెనర్జీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దశాబ్ధన్నర కాలంగా బెంగాల్‌ను శాసించిన మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా అత్యంత గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ రోజు (శుక్రవారం) కోల్‌కతా కాళీఘాట్‌లోని ఆమె నివాసంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి తృణముల్‌ కాంగ్రెస్‌కు చెందిన కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు. 

ప్రస్తుతం మమతా బెనర్జీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇటీవల తృణముల్ పార్టీలో చీలిక రావడం ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు రావడం ఇలా రాజకీయంగా మునుపెన్నడూ లేని సంక్షోభాన్ని చవి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశం ఇప్పుడు మరోసారి హాట్‌టాఫిక్‌గా మారింది.

కోల్‌కతాలోని ఆమె కాళీఘాట్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో తృణముల్ కాంగ్రెస్‌ పార్టీలో మమతాపై ఉ‍న్న వ్యతిరేఖత స్పష్టమవుతోంది. అంతేకాకుండా అత్యధిక సంఖ్యలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు కూడా ఈ భేటీని బహిష్కరించారు.తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న 28 మంది లోక్‌సభ ఎంపీలలో కేవలం నలుగురు మాత్రమే శుక్రవారం నాటి సమావేశానికి వచ్చారు. (వీరిలో మమతా బెనర్జీ  13 మంది రాజ్యసభ ఎంపీలలో కేవలం ఇద్దరే  డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్ మాత్రమే హాజరయ్యారు.

అయితే ఇటీవలే తిరుగుబాటు జెండా ఎగురవేసిన "రీతాబ్రతా బెనర్ మాట్లాడుతూ మమతా బెనర్జీని తమ నాయకురాలిగా అంగీకరించే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మాకున్న ఎమ్మెల్యేల బలం 2/3 వంతు కంటే ఎక్కువే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి మా సంఖ్య ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. వేచి చూడండి, ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. అయితే ఎంపీల విషయమై గత ఏడు రోజులుగా నేను ఎవరితోనూ మాట్లాడలేదు, కాబట్టి వారి గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను" అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. రీతాబ్రతా బెనర్జీకి ప్రస్తుతం 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు సమాచారం .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement