పశ్చిమబెంగాల్: కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గోడౌన్ పైకప్పు కుప్పకూలి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. శిథిలాల కింద మరో 45 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సహాయకు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే శిథిలాల కింద పెద్దఎత్తున కార్మికులు చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


