120 కిమీ వేగం.. గడ్కరీ కాన్వాయ్‌ అడ్డగింత! | ratlam delhi mumbai expressway nitin gadkari security breach villagers protest | Sakshi
Sakshi News home page

120 కిమీ వేగం.. గడ్కరీ కాన్వాయ్‌ అడ్డగింత!

Jul 10 2026 8:11 AM | Updated on Jul 10 2026 8:13 AM

ratlam delhi mumbai expressway nitin gadkari security breach villagers protest

భోపాల్: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మంత్రి కాన్వాయి 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న సమయంలో హఠాత్తుగా నలుగురు యువకులు రోడ్డుపైకి వచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్లు వారిని కార్లు ఢీకొనకుండా తప్పించి కాన్వాయిలోని కార్లు ఢీకొనకుండా కార్లు నడిపించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

అయితే ఆ యువకులు ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో, వ్యవసాయ పొలాల్లో నీరు నిలిచిపోతోందని  తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడానికే గ్రామస్థులు అలా రోడ్డుపైకి వచ్చారని సమాచారం. అయితే కేంద్రమంత్రి కాన్వాయికి సరైన భద్రత కల్పించకపోవడంతో స్థానిక పోలీసు యంత్రాంగపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement