మార్కో రూబియోకు జైశంకర్‌ ఫోన్‌.. దాడిపై సీరియస్‌ | Jaishankar Lodges Strong Protest With Rubio Over Death Of Three Indian Sailors In Gulf Attacks | Sakshi
Sakshi News home page

మార్కో రూబియోకు జైశంకర్‌ ఫోన్‌.. దాడిపై సీరియస్‌

Jun 13 2026 1:30 PM | Updated on Jun 19 2026 2:31 PM

Jaishankar calls US Secretary of State

న్యూఢిల్లీ: హర్ముజ్‌ జలసంధిలో ఇటీవల అమెరికా జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌స్పందించారు. ఈ విషయమై ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

ఇటీవల హర్ముజ్‌ జలసంధిలో అమెరికా భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా తరచుగా దాడులకు తెగబడుతుంది. ఈ దాడులలో ముగ్గురు భారతీయులు మృతిచెందారు. అయినప్పటికీ మరోసారి దాడులకు తెగబడింది20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్‌లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్‌ డి అఫైర్స్‌) జాసన్‌ మీక్స్‌కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పందించారు. ఎక్స్‌ ఖాతాలో "ఈ సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడాను. గల్ఫ్‌లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని భారతదేశం తీవ్రంగా నిరసిస్తున్నట్లు మరోసారి పునరుద్ఘాటించాను. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావు." అని మాట్లాడినట్లు తెలిపారు.

కాగా ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే వివరణ ఇచ్చారు. ఒమన్‌ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్‌ ఘాతుకమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  నిన్న( శుక్రవారం) తేల్చిచెప్పారు. హర్ముజ్‌ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్‌ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో పోస్టుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement