ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్‌ | Delhi Capitals announce Ben Ducketts replacement | Sakshi
Sakshi News home page

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్‌

Apr 23 2026 9:07 PM | Updated on Apr 23 2026 9:14 PM

Delhi Capitals announce Ben Ducketts replacement

ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ముందే వైదొలిగిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ స్ధానాన్ని మరో ఇంగ్లీష్ ప్లేయర్ రెహాన్ అహ్మద్‌తో ఢిల్లీ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనెజ్‌మెంట్ గురువారం అధికారంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఢిల్లీ జట్టులో సరైన ఆల్‌రౌండర్లు లేరు. కెప్టెన్ అక్షర్ పటేల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ అయిన రెహాన్‌తో ఢిల్లీ ఒప్పందం కుదర్చుకుంది.  రెహాన్ అహ్మద్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్‌కు ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. అతడు లెగ్ స్పిన్‌తో పాటు లోయార్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ కూడా చేయగలడు.

కాగా రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్‌ 'ది హండ్రెడ్' టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టు తరపున ఆడనున్నాడు.  స‌ద‌ర్ బ్రేవ్.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ సిస్ట‌ర్ ఫ్రాంచైజీ కావ‌డం గ‌మానార్హం. అతడికి వైట్‌బాల్ క్రికెట్‌లో అద్బుతమైన రికార్డు ఉంది. ఇంగ్లాండ్ తరపున 5 టెస్టులు, 9 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.

మొత్తంగా  అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 49 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ అంతంతమాత్రంగానే రాణిస్తోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడింట గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఐదో స్ధానంలో ఉంది.
చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచ‌ల‌నం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement