ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస ఓటములతో సతమతవుతున్నప్పటికి.. ఆ జట్టు యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ముఖ్యంగా ఈ ఢిల్లీ పేసర్ రెడ్-సాయిల్ పిచ్‌లపై సరైన లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ప్రిన్స్ పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో నిలకడగా వికెట్లు తీస్తూ లక్నో ప్రధాన బౌలర్‌గా మారాడు. ఈ ఏడాది సీజన్‌లో ప్రిన్స్ యాదవ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో ఉన్నాడు.
బుధవారం ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ప్రిన్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. యార్కర్ల వేయడంలో ప్రిన్స్ దిట్ట. దీంతో అతడిని వీలైనంత త్వరగా భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్లు లేరు. సిరాజ్ ఎక్కువగా టెస్టులకే మాత్రమే పరిమితమవుతున్నాడు. దీంతో బుమ్రాపై వర్క్‌లోడ్ పడుతోంది. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్ వంటి యువ సంచలనం జాతీయ జట్టులోకి వస్తే భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
आयरलैंड दौरे के लिए Prince Yadav का नाम फाइनल समझिए।
Prince Yadav का चयन नहीं हुआ तो घोर जातिवाद समझिए। pic.twitter.com/xvqmzz0S5e— Comrade Yadav (@Comrade6989) April 15, 2026
ప్రిన్స్ యాదవ్ డొమాస్టిక్ క్రికెట్‌లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 14 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన ప్రిన్స్.. 5.15 ఏకానమితో 29 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 35 టీ20 వికెట్లు కూడా అతడి పేరిట ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో టీ20 జరిగే టీ20 సిరీస్‌లో భారత తరపున ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశముంది.
చదవండి: IPL 2026: సీఎస్‌కే జట్టులోకి యార్కర్ల కింగ్


