ఐపీఎల్-2026 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలోనే వైదొలిగిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే స్ధానాన్ని సీనియర్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో సీఎస్‌కే భర్తీ చేసింది. ఈ విషయాన్ని సీఎస్‌కే ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించింది. రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌కు మధ్వాల్‌ను చెన్నై జట్టులోకి తీసుకుంది.
మధ్వాల్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. గతంలో అతడు ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. ఇప్పటివరకు 17 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 23 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల మధ్వాల్‌కు దేశవాళీ క్రికెట్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది.
ఇక సీఎస్‌కే విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్‌లో కూడా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్ జట్టుకు భారంగా మారింది. అంతకుతోడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మాత్రే కూడా గాయం కారణంగా దూరం కావడం జట్టుకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది.
రూ.28 కోట్లు ఖర్చు పెట్టి జట్టులోకి తీసుకున్న యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో గత రెండు మ్యాచ్‌లకు వారిని సీఎస్‌కే బెంచ్‌కే పరిమితం చేసింది. గురువారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో ప్రశాంత్ వీర్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
చదవండి: SRH: కమిన్స్‌కు షాక్.. కెప్టెన్‌గా ఇషాన్ కొనసాగింపు!


