దేశంలో చాలామంది యువత కనీస ఉపాధి దొరక్క నానా కష్టాలుపడుతోంటే, నెలకు లక్షల్లో సంపాదిస్తున్నా, జీవితం బోరింగ్‌గా ఉంది అంటున్న ఒక టెకీ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. రియాద్‌లో నివసిస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నెలకు రూ. 10 లక్షలు సంపాదన. నెలకు రూ. 8 లక్షలు ఆదా చేస్తున్నాడు. అయినా సంతృప్తి లేదట. ఎందుకలా?
డబ్బు, ఆస్తులు జీవితానికి పూర్తి సంతృప్తిని ఇవ్వలేవని, జీవనశైలిలో వైవిధ్యం కూడా ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన హంగర్‌స్టేషన్ కోసం రియాద్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడి వివరాలను ఇంజనీర్ అభిషేక్ సింగ్ పంచుకోవడంతో చర్చ మొదలైంది. దీని ప్రకారం అతను నెలకు రూ. 10 లక్షల జీతం. ఖర్చు తక్కువ. దీంతో సగానికిపైగా జీతం ఆదానే. ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 8 లక్షలు ఆదా చేస్తున్నారు. దీంతోపాటు భారతదేశంలో కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినా తన జీవితం చాలా 'బోరింగ్'గా ఉందని వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి: 10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్
జీవితం 'బోరింగ్'?
అధిక వేతనం ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో సంతోషం లేకపోవడం, రోజువారీ రొటీన్ జీవితం విసుగు తెప్పిస్తుందనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. ఇంత సంపాదన ఉన్నప్పటికీ, తన దైనందిన జీవితం చాలా నిరర్థకంగా మారిందని ఆ ఇంజనీర్ పేర్కొన్నారు. ఆయన జీవనశైలి కేవలం "పని, జిమ్, నిద్ర.. మళ్ళీ అదే పని" అన్నట్లుగా ఒకే పద్ధతిలో సాగుతోందని, అందులో ఎటువంటి ఉత్సాహం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో ఆయన బెంగళూరులోని 'ఇన్‌మోబి' (InMobi) , లండన్‌లోని 'వైజ్' (Wise) వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు.
ఇదీ చదవండి: చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఒక స్థాయి దాటిన తర్వాత భౌతిక సుఖాలు, డబ్బు అర్థరహితంగా అనిపిస్తాయి. నిత్యం ఒకే రకమైన జీవనశైలి విసుగు తెప్పిస్తుందఅని కొందరు సమర్థించారు. నెలకు రూ. 2 లక్షలతో రియాద్ వంటి నగరంలో విలాసవంతమైన జీవితం గడపడం కష్టం, ఆయన తన ఖర్చులను తక్కువ చేసి చెబుతున్నారంటూ మరికొందరు విమర్శించారు. కేవలం భారత రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి ఉంటే ఆయన సంపద ఇంకా పెరిగేదని కొందరు సలహా ఇచ్చారు.డబ్బు, స్థిరమైన ఆస్తులు ఉన్నప్పటికీ, జీవితంలో ఉత్సాహం లేకపోవడం అనే అంశంపై ఇది ఆధునిక కార్పొరేట్ జీవితంలోని ఒక వాస్తవాన్ని ఎత్తిచూపుతోంది.
Talked to my friend today.
He’s in Riyadh working at HungerStation.
1. Makes 10L+ per month
2. Saves ~8L per month
3. Says life is boring: work, gym, sleep, repeat
4. Already bought multiple properties in India, net worth is compounding quietly pic.twitter.com/OKVvWrfTWH— Abhishek Singh (@0xlelouch_) April 21, 2026
ఇదీ చదవండి: నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు! లాయర్ సూసైడ్ నోట్ కలకలం


