ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా | Jetlee Movie OTT Release Date Update | Sakshi
Sakshi News home page

Jetlee OTT: సత్య హీరోగా చేసిన కామెడీ మూవీ.. ఓటీటీ ప్రకటన

May 17 2026 4:20 PM | Updated on May 17 2026 4:27 PM

Jetlee Movie OTT Release Date Update

కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్య.. హీరోగా గతంలో ఓ ప్రయత్నం చేశాడు గానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ చాన్నాళ్లకు రీసెంట్‌గానే ఓ కామెడీ మూవీతో వచ్చాడు. తనకు మరింత క్రేజ్ వచ్చేలా చేసిన 'మత్తు వదలరా' దర్శకుడితో కలిసి తీసిన ఈ కామెడీ సినిమా.. ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)

'మత్తు వదలరా' రెండు సినిమాలతో ఆకట్టుకున్న రితేశ్ రానా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జెట్ లీ'. సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధాన పాత్రలు చేశారు. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకోవడంతో ఓ మాదిరి బజ్ ఏర్పడింది. కానీ మే 01న థియేటర్లలోకి వచ్చిన తొలి ఆటకే పూర్తిగా తేలిపోయింది. కామెడీ పేరుతో చేసిన చిత్రవిచిత్ర విన్యాసాలు ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈనెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.

'జెట్ లీ' విషయానికొస్తే.. ప్రజాపతి (అజయ్‌) అనే బిజినెస్‌మ్యాన్ రూ.15 వేల కోట్ల బ్యాంకింగ్‌ స్కామ్‌ చేసి దుబాయ్‌ పారిపోతాడు. దీంతో కేంద్ర హోంమంత్రి మేల్కోటి (శ్రీనివాస్‌ వడ్లమాని) ఇతడిని అరెస్ట్‌ చేసి తిరిగి దేశానికి రప్పించే బాధ్యతని భారత ఇంటెలిజెన్స్‌కి అప్పజెబుతాడు. అయితే కొందరి వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలియడంతో ప్రజాపతి స్వయంగా లొంగిపోయినట్లు నటించి, ఆ తర్వాత తప్పించుకోవాలని ప్లాన్ వేస్తాడు. దుబాయ్‌ నుంచి కొచ్చికి ప్రజాపతిని ప్రత్యేక విమానంలో తీసుకొస్తుండగా.. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? ఇదే  విమానంలో గతం మర్చిపోయిన స్థితిలో ఉన్న డాక్టర్‌ వేదవ్యాస్‌ (సత్య) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement