 
													సాక్షి, ఖమ్మం: సీపీఎం నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఘటన జరిగింది. ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు వచ్చి గొంతు కోసి హత్య చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే హత్య జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. సామినేని రామారావు సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు పని చేశారు
సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. దోషులను చట్టపరంగా శిక్షిస్తామని.. కలుషిత హింస రాజకీయాలకు తావులేదని భట్టి అన్నారు. క్లూస్ టీం, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
